Kiara Advani : సోగకళ్ల చిన్నది కియారా అద్వానీ గురించి ఎంత చెప్పినా తక్కువే. తను ప్రస్తుతం సినిమాలతో ఫుల్ బిజీగా మారి పోయింది. నటుడు సిద్దార్థ్ మల్హోత్రాతో పీకల లోతు ప్రేమలో కూరుకు పోయింది ఈ చిన్నది. తన సోల్ మేట్ అంటూ పేర్కొంది. ఇవాళ ప్రేమికుడి పుట్టినరోజు కావడంతో సర్ ప్రైజ్ చేసింది కియారా అద్వానీ(Kiara Advani). అంతే కాదు ఊహించని గిఫ్ట్ తనకు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఇన్ స్టా లో షేర్ చేసింది.
Kiara Advani Gift to..
స్టైలిష్ దుస్తులతో కనువిందు చేశారు ఈ ఇద్దరు. హ్యాపీ బర్త్ డే మై సోల్ మేట్ అంటూ క్యాప్షన్ కూడా చేర్చింది కియారా అద్వానీ. తను పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ తో కలిసి గేమ్ ఛేంజర్ మూవీలో నటించింది. ఈ సినిమా బిగ్ సక్సెస్ గా నిలిచింది. దీనిని శంకర్ తీశాడు. దిల్ రాజు నిర్మించాడు.
ఇక సిద్దార్థ్ మల్హోత్రా విషయానికి వస్తే తను తుషార్ జలోటా దర్శకత్వం వహించిన పరమ్ సుందరిలో నటించాడు. తనతో కలిసి జాన్వీ కపూర్ ఇందులో నటించింది. ఇక తన లవర్ అయిన కియారా అద్వానీ అయాన్ ముఖర్జీ డైరెక్షన్ వహించిన సీక్వెల్ వార్ 2లో కనిపించనుంది. యాక్షన్ ప్యాక్డ్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో హృతిక్ రోషన్ తో పాటు పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తుండడం విశేషం.
మొత్తంగా కియారా అద్వానీ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.
Also Read : Saif Attack – Raveena : దాడి దారుణం రవీనా టాండన్ ఆగ్రహం