Bobby Deol : బాలీవుడ్ స్టార్ హీరో బాబీ డియోల్ సంచలనంగా మారారు. తన సినీ కెరీర్ ను మలుపు తిప్పింది టాలీవుడ్ కు చెందిన డైనమిక్ డైరెక్టర్ వంగా సందీప్ రెడ్డి. తను ఏరికోరి బాబీ డియోల్(Bobby Deol) ను యానిమల్ సినిమా కోసం తీసుకున్నాడు. అందులో క్రూరమైన విలన్ పాత్ర. ప్రతి నాయకుడిగా ప్రశంసలు అందుకున్నాడు. రణ్ బీర్ కపూర్ తో పాటు బాబి డియోల్ కు ఎక్కువగా ప్రశంసలు లభించాయి.
Bobby Deol Thanks to..
ఇదే సమయంలో తాజాగా మరోసారి వైరల్ గా మారారు బాబీ డియోల్ . దీనికి కారణం టాలీవుడ్ కు చెందిన నట సింహం నందమూరి బాలకృష్ణ, ఊర్వశి రౌటేలా, శ్రద్ధా త్రినాథ్ కలిసి నటించిన డాకు మహారాజ్ సంక్రాంతి పండుగ పర్వదినం సందర్బంగా ఈనెల 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తొలి రోజే రూ. 56 కోట్లు వసూలు చేసింది. రికార్డు సృష్టించింది. అంతే కాకుండా ప్రతి రోజూ ఈ కలెక్షన్ల వరద పారుతోంది.
నట సింహం తన సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ సక్సెస్ ఫుల్ మూవీగా నిలిచింది డాకు మహారాజ్. ఈ చిత్రంలో ప్రతి నాయకుడిగా బాబీ డియోల్ నటించాడు. వంద శాతం మార్కులు పడ్డాయి. సినిమా సక్సెస్ కావడంతో సంతోషానికి లోనయ్యాడు బాలీవుడ్ యాక్టర్. ఈ సందర్భంగా దర్శకుడు బాబీకి థ్యాంక్స్ తెలిపాడు. అంతే కాదు నిన్ను మరిచి పోలేను బదర్ అంటూ సంబోధించాడు. సోషల్ మీడియా వేదికగా అరుదైన బాబీతో దిగిన ఫోటోను పంచుకున్నాడు.
Also Read : పండుగ వేళ గేమ్ ఛేంజర్ కలెక్షన్ల వర్షం