Ajith : సినీ నటుడు అజిత్ కుమార్ అరుదైన ఘనత సాధించాడు. దుబాయ్ వేదికగా జరిగిన కార్ రేసింగ్ ఈవెంట్ లో ఏకంగా మూడో ప్లేస్ లో వచ్చాడు. గత కొంత కాలంగా తను ఫుల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. పిట్ లేన్ లో తన ఫ్యామిలీతో కలిసి ఈ విజయాన్ని ఎంజాయ్ చేశాడు. సినీ రంగానికి చెందిన ప్రముఖులు అభినందనలతో ముంచెత్తారు. ఆర్ మాధవన్, శివ కార్తికేయన్ తో పాటు ఉప ముఖ్యమంత్రి, నటుడు ఉదయనిధి స్టాలిన్ కంగ్రాట్స్ తెలిపారు.
Hero Ajith Racing Sensation..
పిట్ లేన్‌లో ఉన్న తన భార్య షాలినిని ముద్దు పెట్టుకున్నాడు, ఆమె తనను ఉత్సాహపరిచింది. ఆ క్షణాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అజిత్ కుమార్(Ajith) తో పాటు కూతురు కూడా ఉంది. షాలిని ఒకప్పుడు హీరోయిన్ గా నటించింది. దిగ్గజ దర్శకుడు మణిరత్నం తనను గొప్పగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు.
ఆ తర్వాత షాలిని, అజిత్ కుమార్ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు షాలిని. ఇక నటుడు అజిత్ కు ముందు నుంచీ కార్లన్నా, రేసింగ్ లంటే వల్లమాలిన అభిమానం.
ఇదిలా ఉండగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అజిత్ కుమార్ నటనా పరంగా , క్రీడాకారుడిగా రాణించడం తమకు గర్వకారణమని పేర్కొన్నాడు.
Also Read : Hero Vishwak-Siddu : విశ్వక్ సేన్..సిద్దు జొన్నలగడ్డ వైరల్