Satish Nivasam : వర్ణన్ నరహరి, జైష్ణవి కలిసి నిర్మిస్తున్న ది రైజ్ ఆఫ్ అశోక్ నటిస్తున్న ది రైజ్ ఆఫ్ అశోక మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే 80 శాతం పూర్తయిందని నిర్మాతలు వెల్లడించారు. ఈ చిత్రానికి వినోద్ దొండలే దర్శకత్వం వహించాడు. సినిమా ప్రమోషన్ లో భాగంగా ది రైజ్ ఆఫ్ అశోక మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మూవీ మేకర్స్.
Satish Nivasam Updates
అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ది రైజ్ ఆఫ్ అశోక మూవీని తెరకెక్కిస్తున్నామని చెప్పారు దర్శకుడు వినోద్ దొండలే. సతీష్ నీనాసం కెరీర్ లో బిగ్గెస్ట్ మూవీగా నిలుస్తుందని పేర్కొన్నాడు.
అచ్యుత్ కుమార్, సురేష్ , గోపాల్ కృష్ణ దేశ్ పాండే , సంపత్ మైత్రేయ ఇతర పాత్రలలో పోషించారు. ది రైజ్ ఆఫ్ అశోకకు లవిత్ కెమెరా అందించగా పూర్చంద్ర తేజస్వి సంగీతం అందిస్తున్నారు. మొత్తంగా ఎక్కడా రాజీ పడకుంగా అత్యంత రిచ్ గా సినిమాను తెర కెక్కిస్తున్నట్లు తెలిపారు సినీ నిర్మాతలు.
Also Read : Hero Balakrishna Records : బాలయ్యా మజాకా రికార్డుల మోత