TTD : తిరుమల – ఏపీ సీఎం నారా చంద్రబాబు(CM Chandrababu) నాయుడు నిప్పులు చెరిగారు. తిరుపతి ఘటనపై స్పందించారు. తిరుమల పవిత్రత ముఖ్యమన్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా వైకుంఠ ద్వారా దర్శనం జరుగుతుందన్నారు. తిరుమలలో రాజకీయాలు చేయాలని చూస్తే సహించే ప్రసక్తి లేదని హెచ్చరించారు. సేవా భావంతో పని చేయాలన్నారు.
TTD Tragedy..
టోకెన్ల జారీ ఘటనలో ఆరుగురు మృతి చెందడం, 32 మందికి పైగా గాయపడడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చని పోయిన వారి కుటుంబంలో ఒక్కొక్కరికీ రూ. 25 లక్షల పరిహారం, కుటుంబ సభ్యులలో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు సీఎం.
సీరియస్ గా ఉన్న మరో ఇద్దరిలో ఒక్కొక్కరికీ రూ. 5 లక్షలు పరిహారంగా ఇస్తామన్నారు. ప్రభుత్వమే భరించి మెరుగైన వైద్యం అందిస్తుందన్నారు. గాయపడ్డ 33 మందిలో ఒక్కొక్కరికి రూ.2 లక్షల పరిహారం, వారందరికి శ్రీవారి దర్శనం, ఇంటికి చేర్చే బాధ్యత తమదేనని పేర్కొన్నారు.
నిర్లక్ష్యం వహించిన డిఎస్పీ రమణ కుమార్, టిటిడి గోశాల డైరెక్టర్ హరినాథ రెడ్డిలను విధుల నుండి సస్పెండ్ చేశామన్నారు. టిటిడి జేఈవో ఎం. గౌతమి, టిటిడి సివిఎస్వో శ్రీధర్ , తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడులను బదిలీ చేశామని చెప్పారు.
టిటిడి ఛైర్మెన్ బీ.ఆర్. నాయుడు, టిటిడి ఈవో జే. శ్యామలరావు, టిటిడి పాలకమండలి సభ్యులు సమిష్టిగా సమన్వయంతో పనిచేసి భక్తులకు విశేష సేవలు అందించాలని ఆదేశించారు.
Also Read : Jayachandran Death : ప్రముఖ గాయకుడు జయచంద్రన్ కన్నుమూత