Actress Tabu : ఆ బాలీవుడ్ స్టార్ హీరో వల్లే తనకు పెళ్లి కాలేదంటున్న నటి

అయితే ఈ ముద్దుగుమ్మ సింగిల్ గా ఉండటానికి కారణం ఓ స్టార్ హీరో అని వార్తలు వినిపిస్తున్నాయి.

Hello Telugu - Actress Tabu

Tabu : సినిమా ఇండస్ట్రీలో గతఏడాది పెళ్లి బాజాలు గట్టిగానే వినిపించాయి. చాలా మంది హీరోలు, హీరోయిన్స్ పెళ్లిపీటలెక్కారు. కొంతమంది విడాకులు అనౌన్స్ చేసి షాక్ ఇచ్చినా.. చాలా మంది పెళ్లి చేసుకొని కొత్తజీవితాన్ని ప్రారంభించారు. రకుల్ ప్రీత్ సింగ్, లావణ్య త్రిపాఠీ, సోనాక్షి సిన్హా, కీర్తిసురేష్ రీసెంట్ గా పీవీ సింధు ఇలా చాలా మంది ముద్దుగుమ్మలు పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ ను మొదలుపెట్టారు. కానీ కొంతమంది భామలు మాత్రం ఇప్పటికీ పెళ్లి పేరు ఎత్తకుండా సైలెంట్ గా ఉంటున్నారు. నాలుగు పదుల వయసు దాటినా కూడా సింగిల్ గానే ఉంటున్నారు. తాజాగా ఓ బ్యూటీ ఏకంగా ఐదు పదుల వయసు వచ్చినా కూడా పెళ్ళి మాట ఎత్తకుండా సైలెంట్ గా లైఫ్ లీడ్ చేస్తుంది. అంతే కాదు ఈ వయసులోనూ తరగని అందంతో ప్రేక్షకులను కవ్విస్తుంది.

Actress Tabu Comments Viral

అయితే ఈ ముద్దుగుమ్మ సింగిల్ గా ఉండటానికి కారణం ఓ స్టార్ హీరో అని వార్తలు వినిపిస్తున్నాయి. ఓ బడా హీరో వల్లే తాను సింగిల్ గా మిగిలిపోయింది అని సోషల్ మీడియాలో నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. ఇంతకూ ఆ సింగిల్ సింగారి ఎవరంటే .. 50ఏళ్ల వయసులో కూడా తన అందాలతో మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ టబు.ఈ వయ్యారి భామ తెలుగులో చేసింది తక్కువ సినిమాలే కానీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. వెంకటేష్ నటించిన కూలీ నెంబర్ వన్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిన్నది . కూలీ నెంబర్ 1’ తర్వాత చాలా రోజులకి ‘నిన్నే పెళ్లాడతా’లో నటించింది. ఆ సినిమాలో నాగార్జునతో టబు(Tabu) కెమిస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ‘చెన్నకేశవరెడ్డి’, ‘ఆవిడా మా ఆవిడే’, ‘అందరివాడు’, ‘పాండురంగడు’, ‘ఇదీ సంగతి’ ఇసినిమాలు చేసింది. చివరిగా అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సినిమాలో నటించింది. కాగా బాలీవుడ్ లో ఇటీవలి క్రూ సినిమాలో మెరిసింది. ఈ వయసులోనూ ఆమె హాట్ గా నటించి మెప్పించింది.

పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఆ హీరో అంటూ సంచలన కామెంట్లు చేసింది. ఆ హీరోకి భయపడి ఎవరూ.. నా దగ్గరకు రాలేదు అంటూ చెప్పుకొచ్చింది టబు(Tabu) . ఇంతకూ ఆ హీరో ఎవరో కాదు బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్. అప్పట్లో అజయ్, టబు మధ్య ప్రేమాయణం నడిచిందని టాక్ ఉంది. అజయ్ దేవగన్ తో టబు(Tabu) ఎన్నో సినిమాల్లో చేసింది. ఈ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. చిన్న తనం నుంచి టబు, ఆమె సోదరుడు సమీర్ , అజయ్ స్నేహితులట. అప్పట్లో నాకు 13 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఎవరైనా అబ్బాయిలు నా వెంట పడితే మా అన్నయ్యతో కలిసి అజయ్ వాళ్లని పిచ్చి కొట్టుడు కొట్టేవాడు. దాంతో అబ్బాయిలు నాతో మాట్లాడటానికి, నన్ను చూడటానికి కూడా భయపడేవారు. నాకు ఇప్పుడే అర్ధమైంది. ఇప్పటివరకు పెళ్లి కాకపోవడానికి కారణం ఎవరో అంటూ సరదాగా చెప్పుకొచ్చింది టబు.

Also Read : Allu Arjun : బన్నీ కి మరోసారి నోటీసులు జారీ చేసిన రాంగోపాల్ పేట పోలీసులు

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com