Allu Arjun : హీరో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో బెయిల్ పత్రాలను సమర్పించారు. ‘పుష్ప2’ సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో ఏ11గా ఉన్న అర్జున్‌కు నాంపల్లి కోర్టు శుక్రవారం షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. శనివారం ఈ బెయిల్‌కు సంబంధించిన పత్రాలను సమర్పించడానికి మామ చంద్రశేఖర్ రెడ్డితో కలసి అర్జున్ కోర్టుకు హాజరయ్యారు.
Allu Arjun Bail
న్యాయ స్థానం రెండు రూ.50 వేల పూచీకత్తులు అడిగిన నేపథ్యంలో ఒకటి అర్జున్ స్వీయ పూచీకత్తు ఇవ్వగా, మరొకటి తన మేనేజర్ పేరిట దాఖలు చేశారు. పత్రాలపై సంతకాలు చేసి మేజిస్ట్రేట్‌కు సమర్పించారు. ఇక, రెండు నెలల పాటు ఈ కేసుకు సంబంధించి పూర్తి ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసే వరకు ప్రతీ ఆదివారం చిక్కడపల్లి పోలీ్‌సస్టేషన్‌కు అర్జున్ హాజరు కావాలి. అలానే కోర్టు నుంచి ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లడానికి వీలు లేదు.
Also Read:Pawan Kalyan : సినిమా రంగానికి రాజకీయ రంగు పులమడం నాకు నచ్చదు