NTR 100 RS Coin : దివంగత నటుడు, మాజీ సీఎం నందమూరి తారక రామారావు పేరు మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తయారు చేసిన రూ. 100 నాణెం ను సోమవారం విడుదల చేశారు దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. వేదిక మీద రాష్ట్రపతితో పాటు ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలు పాల్గొన్నారు.
NTR 100 RS Coin Released
ఈ సందర్బంగా ఎన్టీఆర్ పై 20 నిమిషాల పాటు తయారు చేసిన వీడియోను ప్రదర్శించారు. ద్రౌపది ముర్ము(Droupadi Murmu) ఎన్టీఆర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా రంగానికి సంబంధించి ఎన్టీఆర్ యుగ పురుషుడంటూ కొనియాడారు. ఆయన తెలుగు జాతికి చేసిన సేవలను ప్రశంసించారు.
ఎన్టీఆర్ కూతురు దగ్గుబాటి పురందేశ్వరి ప్రస్తుతం ఏపీ భారతీయ జనతా పార్టీ చీఫ్ గా కొలువు తీరారు. ఆమె పట్టుపట్టి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పాల్గొనేలా చేశారని టాక్. ఏది ఏమైనా ఎన్టీఆర్ గురించి చెప్పినా తక్కువే. ఎందుకంటే ఆయన మహా నటుడిగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత తెలుగుదేశం పేరుతో పార్టీ పెట్టాడు. ఇదిలా ఉండగా ఆయన భార్య లక్ష్మీ పార్వతి తీవ్ర అభ్యంతరం తెలిపారు.
Also Read : Bandaru Dattatreya : బన్నీతో దత్తన్న ముచ్చట