Trisha : దక్షిణాది అగ్ర కథానాయిక త్రిష ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.. తన కొడుకు చనిపోయాడంటూ ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు తనతోపాటు తన ఫ్యామిలీ కూడా బాధలో ఉన్నామని.. ఈ బాధ నుంచి బయటపడేందుకు కాస్త సమయం పడుతుందని వెల్లడించింది. కొన్నాళ్లు త్రిష(Trisha) పెంచుకుంటున్న పెంపుడు కుక్క పేరు జొర్రో. ఈరోజు ఉదయం జొర్రో మరణించినట్లుగా తెలిపింది. “నా కొడుకు జోర్రో.. ఈ క్రిస్మస్ నాడు తెల్లవారుజామున చనిపోయాడు. నా గురించి బాగా తెలిసినవాళ్లకు జోర్రో నాకు ఎంత ముఖ్యమనేది కూడా తెలుసు. నేను, నా ఫ్యామిలీ ఇప్పుడు చాలా బాధలో ఉన్నాము. కుదుటపడటానికి కొన్నిరోజులు సమయం పడుతుంది. అప్పటివరకు అందుబాటులో ఉండను” అంటూ రాసుకొచ్చింది త్రిష(Trisha). ప్రస్తుతం త్రిష చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. త్రిషకు ధైర్యం చెబుతున్నారు ఫ్యాన్స్.
Actress Trisha Post…
ఇదిలాఉంటే.. గత రెండు దశాబ్దాలుగా సినీరంగంలో వరుస సినిమాలతో దూసుకుపోతుంది త్రిష. తెలుగు, తమిళం, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. కెరీర్ తొలినాళ్లల్లో సైడ్ రోల్స్ పోషించిన ఈ బ్యూటీ.. నీ మనసు నాకు తెలుసు సినిమాతో హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత తెలుగులో ప్రభాస్ జోడిగా వర్షం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతో త్రిష క్రేజ్ ఒక్కసారిగా మారింది. దీంతో తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకుంది.
మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, సూర్య, విజయ్ దళపతి, మాధవన్, విక్రమ్ చియాన్, శింబు వంటి స్టార్ హీరోల సరసన నటించిన మెప్పించింది. ఇప్పటికీ చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది.పొన్నియన్ సెల్వన్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన త్రిష.. ఇటీవలే విజయ్ దళపతి జోడిగా లియో చిత్రంతో మరో హిట్ అందుకుంది. ప్రస్తుతం అజిత్ సరసన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో నటిస్తుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర మూవీలో నటిస్తుంది. త్రిష ప్రస్తుతం తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో నటిగా బిజీగా ఉంది.
Also Read : Venu Swamy : శ్రీతేజ్ కుటుంబానికి తన వంతు విరాళంగా 2 లక్షలు ప్రకటించిన వేణు స్వామి