The Roshans : ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో డాక్యుమెంటరీ ట్రెండ్ నడుస్తోంది. ఇటీవల నయనతార జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిన ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ ఇటీవల విడుదలై విశేష ఆదరణ సొంతం చేసుకుంది. అలాగే ‘ఆర్‌ఆర్‌ఆర్: బిహైండ్ అండ్ బీయాండ్’ పేరుతో మరో డాక్యుమెంటరీ ప్రధాన నగరాల్లోని థియేటర్స్‌లో ఈ నెల 20న విడుదలైంది. ఈ సినిమా ప్రారంభం నుంచి ఆస్కార్ వరకూ ఇందులో చూపించారు. ఇప్పుడు బాలీవుడ్‌కి సంబంధించి స్టార్ హీరో కుటుంబంపై డాక్యుమెంటరీ సిద్థమైంది. త్వరలో ఇది స్ట్రీమింగ్ కానుంది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan) కుటుంబాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కిన డాక్యుమెంటరీ ‘ది రోషన్స్’. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దీనిని రూపొందించింది. జనవరి 17 నుంచి ఇది స్ట్రీమింగ్ కు రానుందని తాజాగా ప్రకటించింది. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు రోషన్ కుటుంబం ఎన్నో సేవలు అందిస్తోంది. ఆ కుటుంబంలో మూడు తరాల వారిని ఈ డాక్యుమెంటరీలో చూపనున్నారు.
The Roshans Documentary…
హృతిక్ రోషన్ ఆయన తండ్రి రాకేశ్ రోషన్, తాతయ్య రోషన్ కెరీర్, పర్సనల్ లైఫ్ గురించి ఇందులో చూపించనున్నారు. 2000 సంవత్సరంలో హృతిక్ పరిశ్రమలో అడుగుపెట్టారు. తన తండ్రి రాకేశ్ రోషన్ దర్శకత్వంలో ‘కహో నా ప్యార్’ హైతో తెరంగేట్రం చేసి విజయాన్ని అందుకున్నారు. ఆ ఏడాది ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమాగా అది నిలిచింది. ఉత్తమ నటుడిగా పురస్కారాలు అందుకున్నారు. ఇక ‘ఫైటర్’తో ఈ ఏడాది ప్రేక్షకులను అలరించారు నటుడు హృతిక్ రోషన్. ఆయన ‘వార్ 2’ కోసం వర్క్ చేస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఎన్టీఆర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. వచ్చే ఏడాది విడుదయ్యే చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
Also Read : Prabhas : భారత్ మోస్ట్ పాపులర్ సెలెబ్రెటీల్లో డార్లింగ్ ప్రభాస్