The Raja Saab : ‘సలార్’, ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాల సక్సెస్ తర్వాత ప్రభాస్ నుంచి రాబోతున్న చిత్రం ‘రాజాసాబ్’. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ నాయికలు. చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. మిగిలిన షూటింగ్‌ను వేగంగా పూర్తి చేయడానికి మారుతీ టీమ్ కృషి చేస్తోంది. అయితే సినిమా సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న విడుదల కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సినిమా గురించి పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో నిర్మాణ సంస్థ స్పందిస్తూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది.
The Raja Saab Movie Updates
ఇప్పటికే ఏప్రిల్ 10న విడుదల కావాల్సిన ‘రాజాసాబ్(The Raja Saab)’ వాయిదా అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు ఈ సినిమా టీజర్ ను ఈ క్రిస్మస్ లేదా న్యూ ఇయర్ కి రిలీజ్ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. దీనిపై నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా సంస్థ స్పందిస్తూ.. ” మూవీ టీజర్ పై సర్క్యులేట్ అవుతున్న వార్తల్లో వాస్తవం లేదు. మా అఫీషియల్ హ్యాండిల్ నుంచి వచ్చిన వార్తలు మినహా ఏవి నమ్మకండి. రాజాసాబ్ టీజర్ అతి తొందర్లోనే రానుంది” అని ట్వీట్ చేశారు. ఇక డార్లింగ్ ఫ్యాన్స్ ప్రభాస్ ను ఎలా స్క్రీన్ మీద చూడాలనుకుంటున్నారో, డైరెక్టర్ మారుతి అలా “రాజా సాబ్” మూవీని రూపొందిస్తున్నారు. భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో ఎక్కడా రాజీ పడకుండా గ్రాండ్‌గా ప్రొడ్యూస్ చేస్తోంది. ‘రాజా సాబ్’ పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ,మలయాళ, కన్నడ, హిందీలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం 80% షూటింగ్ ముగిసింది.
Also Read : Dil Raju : పుట్టినరోజున టీఎఫ్డిసి చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన దిల్ రాజు