SSMB29 : మహేష్‌బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో ‘ఎస్‌ఎస్‌ఎంబీ 29’తెరకెక్కనున్న సంగతి తెలిసిందే! ఈ సినిమా సెట్స్ మీదకు ఎప్పుడు వెళ్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. వాళ్లందరికీ ఓ గుడ్ న్యూస్ అందింది. మహేష్ ఈ సినిమాకు డేట్లు ఇచ్చేశారు. సంక్రాంతి తరవాత షూటింగ్ మొదలు పెట్టుకోవడానికి చిత్ర బృందం సిద్థమైంది. జనవరి ద్వితీయార్థంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించి షూటింగ్ మొదలుపెడతారు. ఇప్పటికే ఏర్పాటు జరుగుతున్నాయి. అయితే రాజమౌళి(SS Rajamouli) స్ర్కిప్టు విషయంలో ఇంకాస్త సమయం తీసుకోబోతున్నారని, ఏప్రిల్ వరకూ షూటింగ్ మొదలు కాదని అనుకున్నారు. అయితే జనవరిలోనే ఈ సినిమా ప్రారంభానికి శ్రీకారం చుట్టడం అభిమానులకు కాస్త ఆశ్చర్యంగా ఉంది.
SSMB29 Movie Updates
ఈ సినిమా కోసం ఓ వైపు రామోజీ ఫిల్మ్‌సిటీతో పాటు, హైదరాబాద్ శివార్లలో కొన్ని భారీ సెట్లు రూపొందించారు. వాటిలోనే తొలి షెడ్యూల్ జరుగుతుంది. ఏప్రిల్ వరకూ హైదరాబాద్‌లోనే షూటింగ్. ఆ తరవాత కొంత బ్రేక్ తీసుకొని, విదేశాల్లో చిత్రీకరించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మహేష్ తప్ప, ఇతర నటీనటులెవర్నీ అధికారికంగా ఖరారు చేయలేదు రాజమౌళి. ఈ సినిమా ప్రకటనకు సంబంధించిన గ్లింప్స్ కూడా సిద్ధమైందట. అందులో ఇతర నటీనటుల్ని కూడా పరిచయం చేసే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. రాజమౌళి ఏ సినిమా మొదలుపెట్టినా ఓ ప్రెస్ మీట్ పెట్టి, కథని క్లుప్తంగా చెప్పి, సందేహాల్ని క్లియర్ చేయడం అలవాటు. ఈసారి ఆయన అదే పంథా అనుసరించబోతున్నారు. దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్ తో రూపొందించే చిత్రమిది. ఈ బడ్జెట్ మరింత పెరిగే అవకాశం ఉందని టాక్.
Also Read : Hero Prabhas : సినిమా షూటింగ్ లో గాయాలపాలైన డార్లింగ్ ప్రభాస్