GV Prakash – Saindhavi : ఒకే వేదికపై కలిసి పాడిన ఒకప్పటి భార్య భర్తలు

ప్రస్తుతం జీవీ ప్రకాశ్‌ అజిత్‌ నటిస్తున్న ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లి’ సినిమాకు సంగీతం అందిస్తున్నారు...

Hello Telugu - GV Prakash - Saindhavi

GV Prakash : కోలీవుడ్‌ మల్టీ టాలెంటెడ్‌ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్‌(GV Prakash), గాయని సైంధవి ఈ మధ్యనే విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే! 11 ఏళ్ల వైవాహిక బంధానికి వీరు వీడ్కోలు పలికారు. తాజాగా ఓ వేదికపై వీరిద్దరూ కలిసి పాడారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో షేర్‌ అవుతోంది. ధనుష్‌ నటించిన ఓ తమిళ సినిమాలోని పాటతో వీళ్లిద్దరూ ప్రేక్షకులను అలరించారు. 2011లో జీవీ ప్రకాశ్‌, సైంధవి కలిసి వర్క్‌ చేసిన మొదటి చిత్రం ‘మయక్కం ఎన్నా’. ధనుష్‌ హీరోగా వచ్చిన ఈ సినిమాలోని ‘పిరై తేడం’ అనే పాటకు జీవీ ప్రకాశ్‌ సంగీతం అందించగా సైంధవి ఆలపించారు. ఇప్పుడు మళ్లీ 13 ఏళ్ల తర్వాత వీళ్లిద్దరూ ఒకే వేదికపై ఈ పాటతో అలరించారు. దీంతో అభిమానులు ఈ వీడియోను షేర్‌ చేస్తున్నారు. ఎమోషనల్‌ మూమెంట్‌ అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. 2013లో జీవీ ప్రకాశ్‌, సైంధవి వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది మేలో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.

GV Prakash – Saindhavi..

ప్రస్తుతం జీవీ ప్రకాశ్‌ అజిత్‌ నటిస్తున్న ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లి’ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అజిత్‌ కెరీర్‌లోనే గొప్ప చిత్రమిది. సంగీత ప్రియులను అలరిస్తుంది. ఈ సినిమా పాటలు ఎన్నోఏళ్ల పాటు రింగ్‌ టోన్స్‌గా వినిిపిస్తాయి’’ అని కచ్చితంగా చెప్పగలను ’’ అని జీవీ ్నపకాష్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తమిళంలో యుగానికి ఒక్కడు, రాజా రాణి, ‘అసురన్‌’, ‘సురరై పోట్రు’(ఆకాశమే నీ హద్దు) లాంటి సూపర్‌ హిట్‌ సినిమాలకు సంగీతం అందించారు జీవీ. తెలుగులో ఉల్లాసంగా ఉత్సాహంగా, ‘డార్లింగ్‌’, ఎందుకంటే ప్రేమంట, ఒంగోలు గిత్త రాజాఽ ది రాజా, జెండాపై కపిరాజు తదితర చిత్రాలకు సంగీతం అందించారు. నటుడిగా 15కు పైగా చిత్రాల్లో నటించారు.

Also Read : Sobhita Dhulipala : చైతూతో లవ్ స్టోరీ పై క్లారిటీ ఇచ్చిన శోభిత

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com