Dushara Vijayan : తన పెళ్లిపై కీలక అంశాలను వెల్లడించిన ‘రాయన్’ సినిమా నటి

‘రాయన్‌’ సినిమా షూటింగ్‌ సమయంలో దర్శకుడు కేఈ జ్ఞానవేల్‌ రాజా సంప్రదించారు...

Hello Telugu - Dushara Vijayan

Dushara Vijayan : సూపర్‌స్టార్‌గా ఎదిగినప్పటికీ.. కాళ్ళు మాత్రం భూమ్మీదే ఉంటాయని, ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండాలన్న విషయాన్ని తన అభిమాన హీరో రజనీకాంత్‌ను చూసి తాను నేర్చుకున్నట్టు యువ హీరోయిన్‌ దుషార విజయన్‌(Dushara Vijayan) చెప్పారు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి, తనకంటూ ఓ స్టార్‌డమ్‌ సొంతం చేసుకున్న యువ హీరోయిన్‌ దుషార విజయన్‌(Dushara Vijayan). ‘సర్బట్టా పరంబరై’ మూవీలో మారియమ్మ పాత్రలో తన నటనతో ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచి, ఎవరీ అమ్మాయి అని ఆశ్చర్యపోయేలా చేసి, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. దిండిగల్‌కు చెందిన ఈ ముద్దుగుమ్మ కెరీర్‌ ఆరంభంలోనే ధనుష్‌, రజనీకాంత్‌, విక్రమ్‌ వంటి స్టార్‌ హీరోల చిత్రాల్లో నటించి ప్రస్తుతం టాప్‌ గేర్‌లో తన కెరీర్‌‌ని కొనసాగిస్తోంది.. ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు.

Dushara Vijayan Comments

‘రాయన్‌’ సినిమా షూటింగ్‌ సమయంలో దర్శకుడు కేఈ జ్ఞానవేల్‌ రాజా సంప్రదించారు. రజనీ, అమితాబ్‌ వంటి గొప్ప నటులు నటించే చిత్రం కావడంతో అది దేవుని ఆశీర్వాదంగా భావించాను. తొలి రోజే సూపర్‌స్టార్‌తో షాట్‌. నన్ను నేను పరిచయం చేసుకున్నాను. ‘సర్బట్టా పరంబరై’లో నా నటన బాగుందని ప్రశంసించారు. ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎంత స్టార్‌డం ఉన్నప్పటికీ ఆయన సాధారణంగా ఉంటారు. ఒకే ఒక సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మాత్రమే. ఆయనకు ప్రత్యామ్నాయం లేదు. తారాస్థాయికి వెళ్ళిన మన కాళ్ళు భూమ్మీదే ఉంటాయనే విషయాన్ని ఆయన వద్ద నేర్చుకున్నాను. మంచి కథలనో లేదా మంచి పాత్రలను వెతుక్కుంటూ నేను వెళ్ళడం లేదు. సహజసిద్ధంగా కుదుతున్నాయి. ఎవరి దగ్గరా అవకాశాల కోసం అడుక్కోవడం లేదు. బలమైన పాత్రల్లో నటించాను. అమాయక పాత్రల్లో నటించాలన్నదే నా కోరిక.

ఎంతోసంతోషంగా ఉంది.విక్రమ్‌తో ‘వీర ధీర శూరన్‌’లో నటిస్తున్నాను. సెట్‌లో ఒకరకమైన వెర్రితనంతో నటిస్తారు. రజనీని ఓ ఉన్నత స్థానంలో ఉంచాను. ధనుష్‌ విషయంలో టైమ్‌, స్పీడ్‌ ముఖ్యం. నా ఇష్టాయిష్టాలను కుటుంబ సభ్యులు బాగా అర్థం చేసుకున్నారు. అందువల్ల పెళ్ళి ప్రస్తావన ఇప్పట్లో ఉండదు. ఎవరెన్ని అనుకున్నా నాకేంటి అనే ధోరణి నాది. నా పని నేను చేసుకుంటున్నా. ఇక్కడ ప్రశాంతంగా ఉండటమే అతిపెద్ద ఛాలెంజ్‌. గెలుస్తాననే నమ్మకం ఎంతో ముఖ్యం. ఎమోషనల్‌గా ఉండేవారికి ఈ సినిమా ఫీల్డ్ సరిపోదు. నేను మోడలింగ్‌ నుంచి చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టాను. ఇక్కడ డబ్బు ముఖ్యం కాదు. సినిమా వదిలివేసి ఇంటికెళ్ళినా మూడు పూటలా అన్నంపెట్టి నన్ను మహారాణిలాగా నా తల్లిదండ్రులు చూసుకుంటారు. ప్రియాంకా చోప్రా బయోగ్రఫీలో నటించాలన్న ఆశ ఉంది.ఆమె జీవితంలో జరిగిన అనేక విషయాలను తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది.

Also Read : Nidhhi Agerwal : చాలా రోజులకు నెటిజన్ల ప్రశ్నల పై స్పందించిన నిధి అగర్వాల్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com