Vijay Deverakonda : నేషనల్ క్రష్ రష్మిక మందన్న, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) రిలేషన్‌షిప్ ఎప్పుడు హాట్ టాపికే. అయితే ఆ వార్తలను పట్టించుకోకుండా వీరిద్దరూ చిల్ అవుతూ.. చాలా కూల్‌గా ఉంటారు. అయితే మరోసారి ఈ జంట ట్రెండింగ్ లోకి వచ్చేసింది. పుష్ప 2 తర్వాత రష్మిక మందన్నా(Rashmika Mandanna) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. నేషనల్ అవార్డు విన్నర్ రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రష్మిక మందన్నా లీడ్ రోల్‌లో నటిస్తున్న వైవిధ్యమైన ప్రేమ కథా చిత్రమిది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. త్వరలోనే టీజర్ ని రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ టీజర్ లో రష్మిక మందన్న పాత్రను, నేపధ్యాన్ని విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్ తో చెప్పిస్తున్నారట.
Vijay Deverakonda….
మరోవైపు ఇటీవల ముంబైలో జరిగిన ఓ ఈవెంట్ లో విజయ్ మాట్లాడుతూ.. “నేను నా కో స్టార్ ఒకరితో డేటింగ్ లో ఉన్నాను. నా వయసు 35, నేను ఒంటరిగా ఉంటానని మీరు ఎలా భావించారు. రొమాంటిక్ రిలేషన్షిప్ లోకి వెళ్లేముందే నేను ఆ వ్యక్తులతో క్లోజ్ గా ఫ్రెండ్షిప్ చేస్తాను. నేను ప్రత్యేకించి డేట్‌లకు వెళ్ళాను, ఎవరితోనైతే చాలా కాలం నుండి ఫ్రెండ్షిప్ ఉంటాదో వాళ్ళతోనే బయటకెళ్తాను. నాకు షరతులు లేని ప్రేమ కావాలి. నాకు ప్రేమించడం తెలుసు, ప్రేమను తీసుకోవడం తెలుసు” అన్నారు. అయితే ఇప్పటికే రశ్మికకి, విజయ్ కి మధ్యలో మంచి స్నేహం ఉంది. దీపావళి కూడా కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. దీంతో విజయ్, రష్మికతో రిలేషన్షిప్‌లో ఉన్నట్లు ఫిక్స్ చేసేస్తున్నారు నెటిజన్లు.
Also Read : Rajinikanth : తలైవా ఫ్యాన్స్ కు మరో డబుల్ ధమాకా అప్డేట్