Sunny Leone : సన్నీ లియోన్ పై అలిగిన హైదరాబాద్ అభిమానులు

ఈ ఈవెంట్‌‌కు హాజరు కావాలనుకునే వారు బుక్ మై షో లో టిక్కెట్స్ పొందవచ్చని తెలపడంతో....

Hello Telugu - Sunny Leone

Sunny Leone : సన్నీలియోన్ ఇలా చేస్తుందని అనుకోలేదు.. అవును ఆమెను అభిమానించే హైదరాబాద్ వాసులు అనుకుంటున్న మాట ఇది. ఈ అందాల తార గురించి ఎందుకిలా అనుకుంటున్నారంటే.. అక్కడ పెద్ద కథే ఉంది. నవంబర్ 30 రాత్రి జరిగిన కథ ఇది. ప్రస్తుతం బాలీవుడ్‌లో సినిమాలతో, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉన్న సన్నీలియోన్(Sunny Leone).. అప్పుడప్పుడు టాలీవుడ్, కోలీవుడ్‌లలో కూడా దర్శనమిస్తోంది. తన వరకు వచ్చిన సినిమాలలో తప్పక నటిస్తానని చెప్పిన సన్నీ.. భాష ఏదైనా సరే అవకాశాన్ని వదులుకోవడం లేదు. అలా టాలీవుడ్‌లోనూ ఇప్పటికే ఓ ఐదారు సార్లు మెరిసింది. బాలీవుడ్, టాలీవుడ్ అనే కాకుండా.. ఆమెకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారనే సంగతి తెలియంది కాదు. అయితే, సన్నీలియోన్(Sunny Leone) విషయంలో ఆమె హైదరాబాద్ అభిమానులు మాత్రం కాస్త కోపంగా ఉన్నారు.

Sunny Leone..

హైదరాబాద్‌లోని ఓ పబ్‌.. నవంబర్ 30 శనివారం రాత్రి 11 గంటల నుండి 12-30 గంటల వరకు నటి సన్నీలియోన్‌తో DJ ఈవెంట్‌ను ప్లాన్ చేసింది. ఈ ఈవెంట్‌‌కు హాజరు కావాలనుకునే వారు బుక్ మై షో లో టిక్కెట్స్ పొందవచ్చని తెలపడంతో.. సన్నీలియోన్ కోసం ఆమె అభిమానులు ఎగబడి మరీ కొనేశారు. సన్నీలియోన్‌‌తో చిందులేసే అవకాశం ఉండటంతో టిక్కెట్ ఎంతనేది కూడా చూడకుండా కొనేసిన వారికి చివరికి తీవ్ర నిరాశ ఎదురైంది. ఆ టైమ్‌లో ఈ వేడుకను జరపడానికి వీలులేదంటూ, విధాన లోపాలు ఉన్నాయంటూ పోలీసుల జోక్యం చేసుకోవడంతో శనివారం రాత్రి జరగాల్సిన ఈ ఈవెంట్ అకస్మాత్తుగా రద్దయింది. దీంతో టిక్కెట్లు కొనుక్కున్న వారంతా తీవ్ర నిరాశకు లోనవడమే కాకుండా సదరు పబ్ యాజమాన్యంపై ఫైర్ అవుతున్నారు.

మొదటపోలీసులు వద్దని చెప్పినా.. ఈవెంట్ ఆర్గనైజర్స్ ఈ ఈవెంట్‌ని నిర్వహించాలని చూడటంతో.. పోలీసులకు ఆ విషయం తెలిసి దాదాపు 100 మంది పోలీసులు ఈ పబ్‌ని మోహరించి.. ఈవెంట్‌కు వస్తున్న వారిని వెనక్కి పంపేసినట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి పబ్‌లలో రకరకాల ఈవెంట్స్‌తో ఆకర్షించేందుకు ఆర్గనైజర్స్ ఇలాంటి ప్లాన్స్ చేస్తుంటారు. సదరు పబ్ వారు సన్నీతో చేయాలనుకున్న ఈ ప్రయత్నం బెడిసికొట్టడంతో.. చేసేది లేక టెన్షన్‌ను తట్టుకోలేక చివరి నిమిషంలో సన్నీలియోన్‌కు అనారోగ్యం అని చెబుతూ ఈవెంట్‌ని రద్దు చేస్తున్నట్లుగా ఓ వీడియోని విడుదల చేశారు. దీంతో అప్పటికే హాజరైన ఆమె అభిమానులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వెనుదిరిగారు. పోలీసులు కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది.

Also Read : Raashii Khanna : నవంబర్ 30న తన వయస్సును ఒక సంవత్సరం పెంచుకున్న రాశి ఖన్నా

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com