Suriya44 : కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో హీరో సూర్య నటిస్తున్న 44వ చిత్రానికి టైటిల్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘కల్ట్’ అనే టైటిల్ ఖరారు చేయాలని మేకర్స్ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. పూజా హెగ్డే హీరోయిన్గా నటించే ఈ చిత్రాన్ని ఒక ప్రేమకథా చిత్రంగా రూపొందిస్తున్నారు. అయితే, ‘కల్ట్’ పేరుతో అధర్వ హీరోగా ఒక టైటిల్ నిర్మాతల సంఘంలో రిజిస్టర్ చేసివుంది. అందువల్ల ఆ టైటిల్ కోసం సంబంధిత నిర్మాతను మేకర్స్ సంప్రదిస్తున్నారు. ఆ నిర్మాత అంగీకరిస్తే సూర్య-44(Suriya44)కు ‘కల్ట్’ అనే పేరు అధికారికంగా వెల్లడించనున్నారు.
Suriya44 Movie Updates
ఇదిలా వుండగా ‘సూర్య-45’ చిత్రం ప్రారంభోత్సవం తాజాగా ఆనైమలై మాసాణి ఆలయంలో జరిగింది. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తొలి రోజు షూటింగ్లో హీరో సూర్య, కొందరు నటీనటులపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. వచ్చే యేడాది ద్వితీయార్థంలో ఈ చిత్రాన్ని విడుదల చేసేలా ప్లాన్ చేశారు. అలాగే, ఇందులో నటించే నటీనటుల వివరాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. సూర్య నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘కంగువా’ రీసెంట్గా బాక్సాఫీస్ వద్దకు వచ్చి నిరాశపరిచిన విషయం తెల్సిందే. ఈ సినిమాను డైరెక్టర్ శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. బాలీవుడ్ నటులు బాబీ డియోల్, దిశా పటానీ వంటి వారు ఇతర ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా ఇచ్చిన నిరాశతో.. ఇకపై చేసే ప్రతి సినిమా విషయంలో జాగ్రత్తగా అడుగులు వేయాలని నిర్ణయించుకున్నట్లుగా ఇటీవల కోలీవుడ్లో వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే.
Also Read : Rashmika Mandanna : నెటిజన్ల కామెంట్స్ పై నిప్పులు చెరిగిన క్రష్మిక