Matka : యాక్టర్ వరుణ్ తేజ్ తన చిత్రాలను ఎంచుకునేటప్పుడు చాలా సెలెక్టివ్‌గా ఉంటారు, కానీ ఇటీవల ఆయన నటించిన సినిమాలు వరుసగా పరాజయాలను చవి చూశాయి. కొత్తగా కనిపించాలనే ఆశతో చేసిన చిత్రం “మట్కా(Matka)” ప్రేక్షకులను ఆకర్షించలేకపోయింది. ‘పలాస’తో గుర్తింపు పొందిన కరుణ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి వరుణ్ తేజ్ గెటప్స్, ట్రైలర్స్ ఆశలు పెంచినప్పటికీ, సినిమా అంతా అంతగా ఆకట్టుకోలేదు. మూడు వారాల్లోనే ఈ సినిమా ఓటీటీ ఛానెల్‌లో స్ట్రీమింగ్‌కి వచ్చింది.
Matka Movie OTT Updates
“మట్కా(Matka)” సినిమా కథ వాసు (వరుణ్ తేజ్) అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. వాసు చిన్నతనంలో ఓ హత్య కేసులో జైలుకెళ్లి, అక్కడ జైలర్ (రవిశంకర్) ద్వారా బలమైన వ్యక్తిగా మారిపోతాడు. జైలులోనే అతనికి ధైర్యం, బలం కలగడం, తద్వారా తన జీవితాన్ని తిరిగి నిలబెట్టుకోవడం ఆసక్తికరంగా కొనసాగుతుంది. జైలు నుండి విడుదలైన వాసు విశాఖపట్నంలోకి వచ్చి, అక్కడ పూర్ణ మార్కెట్‌లో కూలీగా పనిచేస్తాడు. అక్కడ తన యజమాని (అజయ్ ఘోష్)ను రక్షించి వ్యాపారంలో అడుగుపెడతాడు, అప్పుడు మొదలవుతుంది అతని “మట్కా కింగ్” అవ్వడమూ. ఈ దారిలో వాసుకు మిత్రులు మరియు శత్రువులు పెరుగుతారు, వారి మధ్య సాగించే పోరాటాల ద్వారా అతని కథ సాగుతుంది.
“మట్కా” చిత్రంలో వేగం తక్కువగా ఉంది. మొదటి భాగంలో వాసు అభివృద్ధి చెందుతున్న దృశ్యాలు కొంతమేర సాగదీతగా వున్నాయి. కథ చాలా సాదాసీదా, ఊహించదగినదిగా కనిపిస్తుంది. మట్కా గేమ్‌ని కథలో ముఖ్యమైన అంశంగా చూపించి, కథలోని ఉత్కంఠను పెంచాలని దర్శకుడు ప్రయత్నించాడు, కానీ ఈ ఎఫెక్ట్ పూర్తిగా చేరలేదు. మట్కా గేమ్ ఈ చిత్రంలో ప్రత్యేకమైన పాయింట్ గా ఉంది, కాని ఈ ఆటను సులభంగా అర్థమయ్యేలా తీర్చిదిద్దిన దృశ్యాలు మాత్రమే సక్సెస్ అయ్యాయి. ట్రైన్‌లోని “మట్కా” ఆట సీన్ ప్రేక్షకులకు అర్థమయ్యేలా చాలా బాగా రూపొందించారు. ఇది సినిమా లో ఒక మంచి పాయింట్‌గా చెప్పుకోవచ్చు.
సెకెండాఫ్‌లో, మట్కా గేమ్ దేశ ఆర్థిక వ్యవస్థను ఎంత ప్రభావితం చేస్తుందో చూపించాలనుకున్నారు, కానీ అది పెద్దగా చూపించబడలేదు. సీబీఐ, ప్రత్యర్థుల పోరాటాలు, హీరో వీటన్నింటిని ఎలా ఎదుర్కొన్నాడనేది అనేక సన్నివేశాల్లో ఊహించదగినట్లుగా ఉంటుంది, కానీ అవి ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. హీరోయిజం ను ఎలివేట్ చేయడానికి ప్రయత్నించినా, సన్నివేశాల లోతు లేకపోవడం, వాటి ప్రభావం తగ్గించడం కథను స్లోగా చేసింది. హీరో-హీరోయిన్ మధ్య ప్రేమకథ కూడా బలంగా అనిపించలేదు. విలన్‌గా కేబీ(జాన్ విజయ్)ను ఆసక్తికరంగా ఉపయోగించకపోవడం, అతని పాత్ర ఇంత వరకూ పెద్దగా ఎఫెక్ట్ చూపించలేకపోవడం కూడా మరో మైనస్. అయితే, “మట్కా” చిత్రంలో యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
Also Read : Mohanlal : 1000 కోట్ల సినిమాతో రానున్న మలయాళ స్టార్ ‘మోహన్ లాల్’