Music Director Selva : సంగీత దర్శకుడు శక్తి ఆర్.సెల్వను గాయని సుచిత్ర ముప్పుతిప్పలు పెడుతున్నారు. సెల్వ – సుచిత్ర కలిసి రూపొందించిన ఒక ఆల్బమ్ ప్రచార కార్యక్రమాలకు రాకపోవడమే కాకుండా, తన ఫొటోను కూడా ఉపయోగించరాదని సుచిత్ర షరతు విధించారని శక్తి ఆర్ సెల్వ(Music Director Selva) ఆరోపించారు. గత కొంతకాలంగా సుచీ లీక్స్ అంటూ సింగర్ సుచిత్ర పేరు వైరల్ అవుతూనే ఉంది. ఒకప్పుడు స్టార్ సింగర్‌గా దూసుకెళ్లిన సుచిత్ర జీవితం.. ప్రస్తుతం ఎలా తయారయిందో అందరికీ తెలిసిందే. అలాంటి సింగర్‌కు మళ్లీ ఛాన్స్ ఇస్తే.. తనపట్ట దురుసుగా ప్రవర్తిస్తుందని సంగీత దర్శకుడు సెల్వ(Music Director Selva) ఆరోపణలు చేస్తున్నారు.
Music Director Selva…
ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.. ‘‘గాయని సుచిత్రతో కలిసి ‘టైటానిక్ సన్ని సన్ని’ అనే మ్యూజిక్ ఆల్బమ్ రూపొందించాను. ఈ పాట ప్రమోషన్ కోసం ఆమె ఏమాత్రం సహకరించడం లేదు. పైగా రికార్డింగ్ సమయంలో నా పట్ల దురుసుగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా బహిర్గతం చేశాను. మహిళల్లో తనకు మంచి పేరు ఉందని, అందువల్ల తన పేరు, ఫొటో ఎక్కడా ఉపయోగించడానికి వీల్లేదని ఆమె షరతు విధించారు. దివంగత కె.బాలచందర్, సంగీత దర్శకుడు కార్తీక్ రాజా, గేయ రచయిత వైరముత్తు వంటివారిపై అనేక అసత్య ఆరోపణలు చేసిన గాయని… ఇపుడు మాత్రం ఆమె నటించిన ఆల్బమ్ సాంగ్ గురించి ప్రమోషన్ చేయమంటే ససేమిరా అంటున్నారు. గత రెండేళ్ళుగా ఆమెకు ఎలాంటి అవకాశాలు లేవు. ఈ కారణంగానే ఆమె వాయిస్‌ను శ్రోతలకు వినిపించాలనే ఉద్దేశంతో ఈ ఆల్బమ్ రూపొందించాను. కానీ, సుచిత్ర ప్రమోషన్‌కు రాకపోవమేకాకుండా నా పట్ల దురుసుగా ప్రవర్తించారు’’ అని శక్తి ఆర్.సెల్వ ఆరోపించారు.
కాగా, హీరో కరణ్ నటించిన ‘కంద’ చిత్రానికి సంగీతం సమకూర్చిన సెల్వ.. అనారోగ్యం కారణంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇపుడు మళ్ళీ మ్యూజిక్ ఆల్బమ్‌లు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం ఆయన మంచి బ్రేక్ కోసం చూస్తున్నారు. ఈ ఆల్బమ్ తర్వాత తనకు మంచి అవకాశాలు వస్తాయని భావిస్తున్న ఆయనకు సుచిత్ర రూపంలో ఇలా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.
Also Read : Hari Hara Veera Mallu : ‘హరి హర వీరమల్లు’ సెట్స్ పైకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్