Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం పుష్ప 2 ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రష్మిక చేస్తున్నారు భారీ ప్రాజెక్ట్ పుష్ప 2 సినిమా హిట్ అయితే ఈ చిన్నదని రేంజ్ మారిపోతుంది. ఇప్పటికే పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు పుష్ప 2 కూడా సంచలన విజయం సాధిస్తే.. రష్మిక స్పీడ్ ను ఆపడం ఎవరితరం కాదు. ఇదిలా ఉంటే రష్మిక ప్రేమ గురించి, డేటింగ్ గురించి నిత్యం రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. రష్మిక మందన్న(Rashmika Mandanna) , విజయ దేవరకొండ డేటింగ్ లో ఉన్నారంటూ చాలా వార్తలు వచ్చాయి. దీని పై ఈ ఇద్దరూ ఎప్పుడూ స్పందించలేదు. తాజాగా విజయ్ , రష్మిక కలిసి ఓ హోటల్ లో బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్న ఫోటోలు వైరల్‌గా మారాయి. త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే రష్మిక మందన్న పెళ్లి గురించి మాట్లాడింది.
Rashmika Mandanna Comment
ఆదివారం(నవంబర్ 24) రాత్రి చెన్నైలో పుష్ప 2 ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో రష్మిక తన క్యూట్ స్పీచ్ తో ఆకట్టుకుంది. కాగా ఈ వేదికపై హోస్ట్ రష్మిక మందన్నను పెళ్లి గురించి అడిగారు. దీనిపై రష్మిక క్లారిటీ ఇచ్చింది. ‘సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి పెళ్లి చేసుకుంటారా.? లేక బయటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటారా.? మీరు క్లారిటీ ఇస్తే అబ్బాయిని వెతుకుతాం’ అన్నాడు హోస్ట్. ‘ఆ విషయం అందరికీ తెలుసు’ అని రష్మిక సమాధానం ఇచ్చింది. ఇది విని అందరూ ఒక్కసారిగా అరుపులతో హోరెత్తించారు. ‘మీకు ఏం సమాధానం చెప్పాలో నాకు తెలుసు. నాకు బాగా తెలుసు’ అని రష్మిక అన్నారు. రష్మిక, విజయ్ దేవరకొండ డేటింగ్ చేస్తున్నారని ఎప్పటి నుంచో ఉన్న రూమర్. ‘నేను నా కోస్టార్‌తో డేటింగ్ చేస్తున్నా.. ఓ సందర్భంలో పెళ్లి చేసుకుంటాం’’ అని విజయ్ గతంలో చెప్పాడు. విజయ్, రష్మిక జంటగా ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే.
Also Read : Dhanush-Simbu : ఒకే ఫ్రేమ్ లో తమిళ హీరోలు ధనుష్, శింబు