AR Rahman : ఏ ఆర్ రెహమాన్ డివోర్స్ పై స్పందించిన లీగల్ టీమ్

Hello Telugu - AR Rahman

AR Rahman : సంగీత దర్శకుడు ఏ.ఆర్‌.రెహమాన్‌, సైరాభాను విడాకుల నేపథ్యంలో వస్తున్న వార్తలపై ఆయన లీగల్‌ టీమ్‌ స్పందించింది. రెహమాన్‌ వ్యక్తిగత జీవితం గురించి ఎవరైనా తమకు తోచింది రాసినా, యూట్యూబ్‌ వేదికగా అవాస్తవాలు ప్రచారం చేసినా చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన లీగల్‌ టీమ్‌ హెచ్చరించింది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ప్రకటన విడుదల చేసింది.

AR Rahman Legal Team…

తన గురించి ఏ సామాజిక మాధ్యమం వేదికలోనైనా అసత్య ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేయమని రెహమాన్‌ సూచించినట్టు తెలిపింది. ఇప్పటికే పోస్ట్‌ చేసిన అభ్యంతరకర కంటెంట్‌ను 24 గంటల్లోపు తొలగించాలని, లేనిపక్షంలో చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమ 29 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్టు రెహమాన్‌, సైరా బాను దంపతులు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై సోషల్‌ మీడియాలో పలు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో, తాజాగా రెహమాన్‌ లీగల్‌ టీమ్‌ స్పందించింది.

Also Read : KA Movie OTT : ఓటీటీ రిలీజ్ కు సిద్ధమవుతున్న కిరణ్ అబ్బవరం ‘క’ సినిమా

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com