Ram Charan : గ్లోబల్‌స్టార్ రాంచరణ్ హీరోగా ఉప్పెన ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఆర్సీ 16 తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఉత్తరాంధ్రాతో ముడిపడిన క్రీడా నేపథ్యపు కథాంశంతో ఈ చిత్రం రూపొందనుంది. ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శుక్రవారం మైసూర్లో మొదలైంది. చరణ్(Ram Charan) ఈ నెలాఖరు నుంచి కెమెరా ముందుకెళ్లే అవకాశాలున్నాయి. జగపతిబాబు ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు సినీ వర్గాలు ప్రకటించాయి. ‘ఉప్పెన’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్, వృద్థి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఓ కీలక పాత్రని పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం రామ్ చరణ్ కెరీర్లో చాలా ప్రత్యేకం కానుంది.. మట్టి లాంటి చిత్రమిదని ఓ మైల్‌స్టోన్‌గా నిలుస్తుందని చరణ్ ఇప్పటికే చెప్పారు.
Ram Charan-RC16 Movie Updates
ప్రస్తుతం రామ్‌చరణ్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం ప్రమోషన్స్‌ను వినూత్నంగా ప్లాన్ చేస్తున్నారు. దిల్ రాజు ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 10న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Also Read : Mohini Dey : ఏ ఆర్ రెహ్మాన్ విడాకులపై కీలక వ్యాఖ్యలు చేసిన బేస్ గిటారిస్ట్