Kollywood : సినిమా రివ్యూయర్లకి ప్రొడ్యూసర్స్ భారీ షాకిచ్చారు. ప్రధానంగా కంగువా, వేట్టయన్, ఇండియన్ 2 వంటి సినిమాల కలెక్షన్లు తగ్గటానికి వీరి నెగిటివ్ రివ్యూలే కారణమంటూ ఆరోపించారు. ముఖ్యంగా యూట్యూబ్‌లలో రివ్యూలు ఇచ్చే వారిపై జులుం విదిలించారు. అలాగే థియేటర్‌ల వద్ద రివ్యూలు ఇచ్చేవారిపై ఆంక్షలు విధించారు. రానురాను చిత్ర పరిశ్రమకు రివ్యూలు సమస్యగా మారుతున్నాయంటూ వీటిని కట్టడి చేసేందుకు పరిశ్రమలోని అన్ని సంఘాలు ఏకం కావాలని కోలీవుడ్(Kollywood) నిర్మాతలు తీర్మానించారు. ఈ నేపథ్యంలో తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త సినిమా విడుదలైన రోజున థియేటర్ ప్రాంగణంలోకి యూట్యూబ్ ఛానల్స్ వారిని అనుమతించరాదని వారు తెలిపారు. పబ్లిక్ రివ్యూలకు అవకాశం కల్పించకూడదని పేర్కొంది. రివ్యూల పేరుతో నటీనటులతో పాటు దర్శకనిర్మాతలను దూషించినా వదిలిపెట్టమని వారు హెచ్చరించారు.
Kollywood Producers..
ఇటీవలే ‘కంగువా’ సినిమా నెగిటివ్ రివ్యూలపై నటి జ్యోతిక రెస్పాండ్ అయినా విషయం తెలిసిందే.ఆమె మాట్లాడుతూ.. “ఇది నేను సూర్య భార్యగా మాట్లాడం లేదు. ఒక సినీ ప్రేమికురాలిగా రాస్తున్న. కంగువ ఓ అద్భుతమైన సినిమా. సూర్య మీరు ఈ సినిమా చేసినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమాను మీ డ్రీమ్. దానిని ధైర్యంగా ముందుకు తీసుకెళ్లినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అందరూ చెప్తున్నట్టుగానే.. సినిమాలో మొదటి అరగంట కాస్త వర్క్ అవుట్ కాలేదు. సౌండ్‌లో కూడా కాస్త సమస్యలు ఉన్నాయి.
ఇలాంటి లోపాలు సినిమాల్లో ఓ భాగం. భారతీయ చిత్రాల్లో ఇది చాలా కామన్. ముఖ్యంగా సరికొత్తగా సినిమాలు చేయాలని ప్రయత్నించినప్పుడు ఇలాంటివి జరుగుతాయి. వాటిని ప్రయోగాల్లో భాగంగానే చూడాలి. అయితే మొదటి అరగంట సినిమాని పట్టుకుని.. తర్వాతి రెండున్నర గంటల సినిమాని నెగిటివ్ చేయడం సరికాదు. నిజం చెప్పాలంటే కంగువ అనేది గొప్ప సినిమేటిక్ అనుభవం. కెమెరా వర్క్, దానిని ఎగ్జిక్యూట్ చేసిన విధానాన్ని నేను తమిళ సినిమాల్లో ముందెప్పుడు చూడలేదు. అయితే కొందరు మీడియాకి చెందిన వ్యక్తులు, మరికొందరు కలిసి.. కావాలనే సినిమాపై నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారు” అంటూ చెప్పారు.
Also Read : Pushpa 2 : విడుదలకు ముందే విధ్వంసం సృష్టిస్తున్న పుష్పరాజ్