Naga Chaitanya : అక్కినేని వారింట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. టాలీవుడ్ హీరో నాగ చైతన్య(Naga Chaitanya), శోభిత ధూళిపాళ పెళ్లి పనులు మొదలయ్యాయి. కొన్ని రోజుల క్రితమే పెళ్లి పనులు స్టార్ట్ చేసినట్లు శోభిత ఓ పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఇక మరికొన్ని రోజుల్లో వీరిద్దరి వివాహం జరగనుంది. ఇప్పుడు శుభలేఖలు పంచే కార్యక్రమం కూడా షురూ అయిపోయింది. అమ్మాయి తరపున వాళ్లు ఇచ్చే పెళ్లి కార్డుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ వెడ్డింగ్ కార్డులో శోభిత(Sobhita), నాగచైతన్యకు డిసెంబర్ 4న పెళ్లి జరగనుందని.. తామెల్లరూ విచ్చేసి ఆశీర్వదించాలని అని రాసుకొచ్చారు. అయితే కేవలం పెళ్లి కార్డు మాత్రమే కాకుండా వెదురు బుట్టలో చీర, పసుపు కుంకుమ, వెండి వస్తువు వీటన్నింటితో కలిపి పెళ్లి కార్డుగా ఆహ్వానంగా అందించినట్లు వైరల్ అయినట్లు తెలుస్తోంది.
Naga Chaitanya-Sobhita Marriage Invitation
అయితే ఈ పెళ్లి కార్డులో డిసెంబర్ 4 పెళ్లి అని ఉండగా.. వేదిక ఎక్కడనేది కనిపించలేదు. అయితే కొన్ని రోజులుగా శోభిత(Sobhita), నాగచైతన్య పెళ్లి అన్నపూర్ణ స్టూడియోలోనే ప్రత్యేకంగా వేసే మండపం సెట్ లో శుభకార్యం జరగనుంది. ఈ మేరకు త్వరలో ఏర్పాట్లు మొదలవుతాయని తెలుస్తోంది. కొన్ని రోజుల తర్వాత వీరి పెళ్లి గురించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. శోభిత, నాగచైతన్య నిశ్చితార్థం ఆగస్ట్‌లో జరిగింది. గత ఏడాదిగా వీరిద్దరు ప్రేమలో ఉన్నట్లు నెట్టింట ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. వీరి ఎంగేజ్మెంట్ ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోలో హిందూ సంప్రదాయ పద్దతిలో వీరిద్దరి వివాహం జరిగనుంది. వీరి పెళ్లికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని స్థానిక కళాకారుల నుంచి చీరల షాపింగ్ చేస్తున్నట్లు టాక్ నడుస్తుంది. ఇదిలా ఉంటే.. చైతూ ప్రస్తుతం తండేల్ చిత్రంలో నటిస్తుంది. చందూ మొండేటీ దర్శకత్వం వహిస్తున్న న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి కథానాయికగా నటిస్తుంది. వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.
Also Read : Actress Kasthuri : తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యల కేసులో నటి ‘కస్తూరి’ అరెస్ట్