ఇవాళ యావత్ భారతమంతా సంబురాలలో మునిగి పోయింది. ఇస్రో చరిత్రలో మైలు రాయిగా నిలిచి పోయేలా చేసింది. కారణం చంద్రయాన్ -3 చంద్రుడి వద్దకు చేరడం. దీంతో ప్రపంచంలో నాలుగో దేశంగా నిలిచింది. అంతకు ముందు కేవలం మూడు దేశాలు మాత్రమే ఆ ఘనతను పొందాయి.
వాటిలో అమెరికా, చైనా, రష్యా. కానీ ఇప్పుడు అగ్ర రాజ్యాల సరసన భారత్ కూడా చేరి పోయింది. దీని వెనుకాల ఎందరో సైంటిస్టులు ఉన్నారు. వారందరికీ పేరు పేరునా అభినందనలు తెలియ చేస్తున్నారు సినీ, రాజకీయ, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు. అంతే కాదు వ్యాపారవేత్తలు, దిగ్గజాలు కూడా.
తాజాగా ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆమె ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా మహిళా సైంటిస్టులతో కూడిన అరుదైన ఫోటోను షేర్ చేశారు. మహిళలు కూడా ఎందులోనూ తక్కువ కాదని నిరూపించారని కొనియాడారు.
మీరు ఇస్రోకే కాదు యావత్ భారతావనికి స్పూర్తి దాయకంగా నిలిచారని ప్రశసించారు చిన్మయి శ్రీపాద. అంతే కాదు యువత ప్రత్యేకించి బాలికలు, యువతులు, మహిళలు విద్యపై ఎక్కువగా ఫోకస్ పెట్టాలని సూచించారు. దీని వల్ల ఆత్మ విశ్వాసం కలుగుతుందని పేర్కొన్నారు.