Vijay Devarakonda : ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న యంగ్ హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు. ఫిల్మ్ బ్యాగ్రౌండ్ కాకపోయినా నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టి మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన విజయ్(Vijay Devarakonda)… పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మారాడు. ఆ తర్వాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ డమ్ అందుకున్నాడు. ఈ మూవీ ఏ రేంజ్ హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు. ఈ మూవీతో అమ్మాయిల్లో విజయ్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. అతి తక్కువ సమయంలోనే పలు హిట్ చిత్రాల్లో నటించిన విజయ్ కెరీర్ లో అటు డిజాస్టర్స్ కూడా లేకపోలేదు. కానీ హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో అలరిస్తున్నాడు విజయ్(Vijay Devarakonda). ఇదిలా ఉంటే.. ఇటీవల విజయ్ దేవరకొండకు సంబంధించిన ఓ వీడియో ఇటీవల వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.
Vijay Devarakonda..
ఇటీవల విజయ్ ముంబైలో ఓ ఈవెంట్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే ఆ ఈవెంట్ నుంచి తిరిగి వస్తుండగా.. మెట్లపై అనుహ్యంగా జారి పడ్డాడు. ఇక ఆ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. దీంతో ఇప్పుడు ఆ వీడియోకు తమ స్మార్ట్ ఐడియాను జత చేసి తన రౌడీ అనే క్లాత్ బిజినెస్ కోసం సరికొత్తగా క్రియేట్ చేశాడు. మెట్ల మీద పడ్డ వీడియోకు కింద స్టైల్ గా పడుతున్నది జతచేసి ఓ వీడియో ఎడిట్ చేశాడు.
ఆ వీడియోతో నేను పడుతూనే ఉంటాను ప్రేమలో నా రౌడీ బాయ్స్ , గర్ల్స్ తో.. రౌడీ వేర్ తో కూడా అందరూ ప్రేమలో పడతారు అంటూ ఓ యాడ్ వీడియో తయారుచేశాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ కావడంతో.. ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. సడెన్ గా పడిన వీడియోను కూడా ఇలా క్రియేట్ చేశాడని.. వాటే ఐడియా సర్ జీ, భలే ఎడిట్ చేశాడే అంటూ విజయ్ స్మార్ట్ ఐడియాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. విజయ్ ప్రస్తుతం తన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. అలాగే హిందీలో ఓ ప్రైవేట్ సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
Also Read : Bose Veerapaneni : సీనియర్ ఎన్టీఆర్ సన్నిహితుడు ‘బోస్ వీరపనేని’ కన్నుమూత