Bunny-Rashmika : పుష్ప 2 రిలీజ్ కు ముందే బన్నీకి స్పెషల్ గిఫ్ట్ పంపిన రష్మిక

ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా బన్నీనే అందరితో షేర్ చేసుకున్నాడు...

Hello Telugu - Bunny-Rashmika

Rashmika : ‘పుష్ప 2’ సినిమా విడుదలకు ఇంకా నెల రోజులు కూడా సమయం లేదు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇక అల్లు అర్జున్(Allu Arjun) కూడా ఈ ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఆహా వేదికగా బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తోన్న అన్ స్టాపబుల్ టాక్ షోలో అల్లు అర్జున్ గెస్ట్ గా కనిపించి అక్కడి నుంచి పుష్ఫ2 సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా ఎట్టి పరిస్థితుల్లోనైనా డిసెంబర్ 5కి సినిమా రిలీజ్ కావాల్సిందే అనే టార్గెట్‍‌తో బిజీబిజీగా ఉంటోంది చిత్ర బృందం. ఈ క్రమంలోనే మ్యూజిక్ డైరెక్టర్స్ కొత్తోళ్లు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం పనిచేస్తున్నారనే రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఈ సంగతి పక్కన పెడితే పుష్ఫ 2 సినిమా రిలీజ్ కు ముందు ఇందులో హీరోయిన్‌గా చేస్తున్న రష్మిక(Rashmika) హీరో అల్లు అర్జున్‌కి ఒక స్వీట్ గిఫ్ట్ ఇచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా బన్నీనే అందరితో షేర్ చేసుకున్నాడు. ‘ఎవరికైనా వెండి బహుమతిగా ఇస్తే వాళ్లకు అదృష్టం కలిసొస్తుందని మా అమ్మ తరచూ చెప్పేది. ఈ చిన్న వెండి వస్తువు, స్వీట్స్.. మీకు మరింత అదృష్టం తీసుకొస్తుందని అనుకుంటున్నాను. మీకు, మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు’ అని రష్మిక(Rashmika) సందేశం పంపింది. ఈ నోట్‌ను షేర్‌ చేస్తూ.. ‘‘థాంక్యూ మై డియర్‌.. ఇప్పుడు మరెంతో అదృష్టం కావాలి’’ అని అల్లు అర్జున్‌ రాసుకొచ్చారు. దీనిపై రష్మిక స్పందిస్తూ.. ‘‘బాక్సాఫీస్‌ వద్ద ‘పుష్ప’ తప్పకుండా రూల్‌ చేస్తుంది. మన కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ప్రేక్షకులు మన కష్టాన్ని గుర్తిస్తారు. ఆ విషయంలో నేను ఎంతో నమ్మకంతో ఉన్నా’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

Rashmika Gives…

సుకుమార్‌తెరకెక్కించిన ‘పుష్ప ది రైజ్‌’ పేరుతో తొలి భాగం 2021లో విడుదలైంది.ఇందులో పుష్ప రాజ్‌గా అల్లు అర్జున్‌ , శ్రీవల్లిగా రష్మిక మందన్నా అందరి మనసులు గెల్చుకున్నారు. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా ‘పుష్ప ది రూల్‌’ సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి. డిసెంబర్‌ 5న పుష్ఫ 2 సినిమా గ్రాండ్ రిలీజ్‌ కానుంది. ఈసినిమాలో స్పెషల్‌ సాంగ్‌ కోసం శ్రీలీలను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

Also Read : Christopher Nalon : ఆ ఇద్దరు భామలతో సినిమాకు సిద్ధమైన హాలీవుడ్ ఆస్కార్ విన్నింగ్ డైరెక్టర్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com