Janaka Aithe Ganaka : ప్రసన్నవదనం వంటి క్రైమ్ థ్రిల్లర్ చిత్రం తర్వాత సుహాస్(Suhas) హీరోగా నటించిన చిత్రం జనక అయితే గనక(Janaka Aithe Ganaka). ఇప్పుడిప్పుడే వరుస వైవిధ్యమైన చిత్రాలతో ఆడియెన్స్‌కు బాగా దగ్గరవతున్న సుహాస్(Suhas) మరోసారి జానర్ మార్చి కొత్తగా ఫ్యామిలీ డ్రామాతో ఆక్టోబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంగీర్తన, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్, మురళీ శర్మ, గోపరాజు రమణ, కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆక్టోబర్ మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రశాంత్ నీల్ వద్ద అసిస్టెంట్‌గా పని చేసిన సందీప్ రెడ్డి బండ్ల ఈ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. తాజాగా ఈ సినిమా శుక్రవారం (నవంబర్ 8) నుంచి ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
Janaka Aithe Ganaka Movie OTT Updates
కథవిషయానికి వస్తే.. ప్రసాద్ (సుహాస్) ఓ మిడిల్ క్లాస్ వ్యక్తి. భార్య, తల్లి, తండ్రి, నాయమ్మలతో కలిసి ఒకే ఇంట్లో ఉంటుంటాడు. తండ్రి చేసిన ఓ చిన్న తప్పిదం వళ్ల అర్థికంగా వెనకబడి ఉంటారు. ఆ విషయంలో తండ్రి (గోపరాజు రమణ)ని ఎప్పుడూ ఆటపట్టిస్తుంటాడు. ఆపై ఓ వాషింగ్ మెషిన్ కంపెనీలో సేల్స్ అండ్ సర్వీసెస్ విభాగంలో జాబ్ చేస్తు తన ఫ్యామిలీని నడిపిస్తుంటాడు. పగలంతా డ్యూటీ, రాత్రయితే ఫ్రెండ్ లాయర్ పత్తి కిశోర్ తో మందు పార్టీలో ఉంటుంటాడు. అయితే ఇప్పుడున్న కాస్ట్‌లీ ప్రపంచంలో పిల్లలను పెంచడం సాధ్యం కాదని, తన భార్య (సంగీర్తన)తో ఓ అండర్‌స్టాండింగ్‌కి వచ్చి పిల్లలు వద్దనుకుంటారు.
అలారెండు సంవత్సరాలు గడిచాక సడెన్‌గా తన భార్య ప్రెగ్నెంట్ అని తెలుసుకుని ప్రసాద్ షాకవుతాడు. సేఫ్టీ వాడినా, తన భార్య ఎలా ప్రెగ్నెంట్ అయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫ్రెండ్ పత్తి కిశోర్‌తో మాట్లాడి తను వాడిన కండోమ్ కంపెనీపై రూ. కోటికి దావా వేస్తాడు. ఈ నేపథ్యంలో కోర్టుకు వెళ్లిన ప్రసాద్‌కు అక్కడ ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? ఫ్యామిలీ, బయటి సమాజం ప్రసాద్‌ని ఎలా చూసింది? కోర్టులో విజయం సాధించాడా? సేఫ్టీ వాడినా తన భార్య ఎలా ప్రెగ్నెంట్ అయింది? అసలు తను కోర్టుకు వెళ్లడానికి కారణం ఇదేనా? ఇంకా వేరే ఏదైనా ఉందా? వంటి విషయాలను కామెడీ జోడించి ఆసక్తికరంగా ఈ సినిమాను రూపొందించారు.
దర్శకుడుతన రియల్ లైఫ్‌లో చూసిన సంఘటనలతో ఈ కథను రెడీ చేసుకునప్పటికీ.. ఇలాంటి ఓ నేపథ్యంతో సినిమా చేయడం అనేది సాహసమే. పైకి పిల్లల పుట్టుకకు సంబంధించిన కథగా అనిపించినా.. అంతర్గతంగా దర్శకుడు ఇందులో లేవనెత్తిన విషయాలు మాత్రం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తాయి. కానీ ప్రస్తుత సమాజంలో అవి సినిమాకే పరిమితమవుతున్నాయి తప్పితే.. నిజంగా ఎవరూ నిలబడి ఆలోచించడం లేదు. పోరాటం చేయడం లేదు. ఉదాహారణకు.. పెద్దవాళ్లు వేసుకునే చొక్కా ఖరీదు రూ. 500 ఉంటే, చిన్న పిల్లలు వేసుకునే చొక్కాకు తక్కువ క్లాత్, తక్కువ దారం పడుతుంది. అయినా రూ. 1500 ఎందుకు ఉంటుంది? అంటూ ఇలా దర్శకుడు టచ్ చేసిన కొన్ని పాయింట్స్ చాలా మందికి ముఖ్యంగా మధ్యతరగతి వారికి బాగా కనెక్ట్ అవుతాయి. ఇప్పుడీ సినిమా ఈ రోజు (నవంబర్ 8) నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఎవరైతే థియేటర్లో మిస్సయ్యారో, మంచి ఫ్యామిలీ కామెడా సినిమా కోసం ఎదురు చూస్తున్నారో వారు ఈ మూవీని నిరభ్యంతరంగా తిలకించొచ్చు.
Also Read : Shiva Rajkumar : అనారోగ్యంతో బాధపడుతున్న కన్నడ స్టార్ ‘శివ రాజ్ కుమార్’