Salaar Bookings : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న సలార్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్రం చివరి దశలో ఉంది. ఇప్పటికే సినిమా రిలీజ్ కు సంబంధించి మూవీ మేకర్స్ అప్ డేట్ ఇచ్చారు. ఇక సలార్ కు సంబంధించి ముందస్తు ప్రదర్శనకు గాను అమెరికాలో పెద్ద ఎత్తున డిమాండ్ ఉంటోంది.
Salaar Bookings Huge
ముందస్తు అమ్మకాలు రూ1, 28,980 డాలర్లు కొల్లగొట్టింది కేవలం ప్రిమీయర్ షోకు మాత్రమే. అమెరికాలోని 141 ప్రాంతాలలోని థియేటర్లలో సలార్(Salaar) విడుదల కానుంది. 363 ప్రదర్శనలు ఇస్తారు. ఇప్పటి వరకు సలార్ చిత్రానికి సంబంధించి 4, 456 టికెట్లు అమ్ముడు పోయాయి.
ప్రభాస్ మేనియా మామూలుగా లేదని అర్థమై పోయింది. ఇక ప్రశాంత్ నీల్ అనే సరికల్లా టేకింగ్, మేకింగ్ లో తన సత్తా ఏమిటో చూపిస్తాడని ఫ్యాన్స్ నమ్మకం పెట్టుకున్నారు. ఇప్పటికే ఓం రౌత్ దర్శకత్వంలో నటించిన ఆది పురుష్ చిత్రంపై మిశ్రమ స్పందన వచ్చింది.
అంతకు ముందు విడుదలైన రాధే శ్యామ్ ఆశించిన మేర ఆడలేదు. దీంతో డార్లింగ్ ప్రభాస్ ప్రశాంత్ నీల్ పై ఎక్కువగా ఆధారపడ్డాడు. తనను సలార్ గట్టెక్కిస్తుందని ఆశిస్తున్నాడు. మొత్తంగా ప్రశాంత్ నీల్ మార్క్ ఉండబోతుందా అనేది వేచి చూడాలి. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు టీజర్ కు భారీ ఆదరణ లభిస్తోంది.
Also Read : Sakshi Vaidya : ఉస్తాద్ భగత్ సింగ్ లో సాక్షి వైద్య