Unstoppable : నటసింహం నందమూరి బాలకృష్ణ ఓ వైపు హీరోగా రాణిస్తూనే మరోవైపు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న.. అన్ స్టాపబుల్(Unstoppable) అనే టాక్ షోతో బాలయ్య ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ షోను దేశంలోనే నెంబర్ వన్ గా నిలబెట్టారు బాలయ్య. ఇప్పటికే ఈ టాక్ షో మూడు సీజన్స్ ను పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు సీజన్ 4కు రంగం సిద్ధమైంది. ఈ సారి బాలయ్య షోకు ఎవరు గెస్ట్ లుగా రాబోతున్నారు అన్నది ప్రేక్షకుల్లో ఆసక్తికరంగా మారింది. కాగా బాలయ్య షోకు అన్ స్టాపబుల్ సీజన్ 4కి మొదటి గెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రానున్నారు. గతంలో అన్ స్టాపబుల్ సీజన్ 2కి చంద్రబాబు హాజరయ్యారు.
Unstoppable with NBK 4…
కాగా గతంలో ప్రతిపక్ష నాయకుడిగా హాజరైన చంద్రబాబు ఇప్పుడు సీజన్ 4లో ముఖ్యమంత్రిగా హాజరు కానున్నారు. దాంతో ఈ ఎపిసోడ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలయ్యతో చంద్రబాబు ఎలాంటి విషయాలు పంచుకోనున్నారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో బాలయ్య చంద్రబాబుతో ఎన్నో సరదా విషయాలను పంచుకున్నారు. తనదైన చిలిపితనంతో ప్రశ్నలు వేసి చంద్రబాబును తికమక పెట్టారు. కాగా ఇప్పుడు ఈ ఇద్దరూ మరోసారి కలిసి సందడి చేయడానికి ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
Also Read : Pawan Kalyan : పవర్ స్టార్ ‘హరిహర వీరమల్లు’ సినిమా నుంచి పవర్ ఫుల్ అప్డేట్