Appudo Ippudo Eppudo : ‘కార్తికేయ 2’ చిత్రంతో నేషనల్ రేంజ్ పాపులారిటీని సొంతం చేసుకున్న హీరో నిఖిల్.. ప్రస్తుతం చేస్తున్న చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో(Appudo Ippudo Eppudo)’తో అతి త్వరలో ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. ‘ స్వామి రారా, కేశవ’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత సుధీర్ వర్మ, నిఖిల్(Nikhil) కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీగా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ చిత్రంలో కన్నడ క్రేజీ హీరోయిన్ అయిన రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించారు. మరో బ్యూటీ డాల్ దివ్యాంశ కౌశిక్ కీలక పాత్రలో నటించగా.. హర్ష చెముడు ఓ ముఖ్య పాత్రను పోషించారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. ఆ వివరాల్లోకి వెళితే..
Appudo Ippudo Eppudo Movie Song Updates..
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యానర్‌పై ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన సీనియర్ నిర్మాత బి. వి. ఎస్.ఎన్.ప్రసాద్ ఈ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ చిత్రాన్ని నిర్మించారు. యోగేష్ సుధాకర్, సునీల్ షా, రాజా సుబ్రమణ్యం ఈ సినిమాకు కో ప్రొడ్యూసర్స్. బాపినీడు.బి ఈ చిత్రానికి సమర్పణ. ఇక చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ‘హే తార’ అంటూ సాగే ఓ మెలోడియస్ గీతాన్ని యూనిట్ విడుదల చేసింది.
కార్తీక్ స్వరపరిచిన ఈ బాణీకి కృష్ణ చైతన్య సాహిత్యాన్ని అందించారు. కార్తీక్, నిత్యశ్రీల గాత్రంలో ఈ పాట ఎంతో వినసొంపుగా శ్రోతలకు హాయినిచ్చేలా ఉంది. ఈ పాట హీరో హీరోయిన్ మధ్య ప్రేమ, కెమిస్ట్రీని తెలిపేలా సాగింది. మనోహరమైన సాహిత్యం హృద్యమైన ట్యూన్‌ని కలిగి ఉన్న ఈ మెలోడీతో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ప్రేమలో పడతారనిపిస్తోంది. సింగర్ కార్తీక్ ఈ చిత్రానికి సంగీతాన్ని.. సన్నీ ఎం.ఆర్ బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందిస్తున్నారు. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. ఈ ఏడాది దీపావళి సందర్భంగా నవంబర్ 8న ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Also Read : Tamannaah : ఈడీ ముందు హాజరైన మిల్కీ బ్యూటీ తమన్నా