Radhika Apte : పుష్కర కాలానికి తల్లి కాబోతున్న బాలీవుడ్ భామ ‘రాధికా ఆప్టే’

పెళ్లికి ముందు కంటే పెళ్లి తర్వాతే ఆమె ఎక్కువ అవకాశాలు అందుకోవడం విశేషం...

Hello Telugu - Radhika Apte

Radhika Apte : బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ రాధికా ఆప్టే అభిమానులకు శుభవార్త చెప్పారు. త్వరలోనే ఆమె తల్లి కాబోతున్నారు. బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. నవంబర్‌లో పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు. తాను తల్లి కాబోతున్న విషయాన్ని రాధిక(Radhika Apte) ఇప్పటివరకు వెల్లడించలేదు. బుధవారం లండన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో తన కొత్త సినిమా ‘సిస్టర్‌ మిడ్‌నైట్‌’ ప్రీమియర్‌ షోకు హాజరయ్యారు. అక్కడ ఆమె బేబీ బంప్‌తో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచారు. కెరీరీ పీక్స్‌లో ఉండగా 2012లో ఆమె బ్రిటీష్‌ వయొలనిస్ట్‌ బెండిక్ట్‌ టేలర్‌ను వివాహం చేసుకుంది. పెళ్లయిన 12 ఏళ్ల తర్వాత ఆమె తల్లి కాబోతుంది.

Radhika Apte will be Mother

పెళ్లికి ముందు కంటే పెళ్లి తర్వాతే ఆమె ఎక్కువ అవకాశాలు అందుకోవడం విశేషం. పెళ్లి తర్వాత కూడా ఆమె బోల్డ్‌ పాత్రల్లో నటించారు. న్యూడ్‌, సెమీ న్యూడ్‌ చిత్రాల్లో కూడా ఆమె నటించారు. పార్చ్‌డ్‌ సినిమాలో కొన్ని అశ్లీల సన్నివేశాల్లో నటించి మెప్పించారు తమిళనాడులోని వెల్లూరులో జన్మించిన రాధికా.. థియేటర్‌ ఆర్టిస్టుగా కెరీర్‌ మొదలెట్టారు. హిందీ, మరాఠి, తమిళం, తెలుగు, మలయాళం, బెంగాలీ భాషలతోపాటు ఇంగ్లీష్‌ సినిమాల్లోనూ నటించారు. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను ఎంచుకుని మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రక్త చరిత్ర, లెజెండ్‌, లయన్‌ వంటి సినిమాలతో టాలీవుడ్‌ ప్రేక్షకులకు కూడా చేరువయ్యారు. తానూ గర్భవతి అన్న పోస్ట్ ను సోషల్ మీడియా వేదిక చుసిన విజయ్ వర్మ, మృణాల్ ఠాకూర్, గుణీత్ మోంగా తదితరులు రాధికకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Also Read : Pushpa 2 : పుష్ప 2 సినిమాలో మరో పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com