Salman Khan : ఆ హీరోయిన్ తో సినిమాకి నో చెప్పిన సల్మాన్

ఈ మూవీలో సల్మాన్ ఖాన్ సరసన సోనమ్ కపూర్ కథానాయికగా నటించింది...

Hello Telugu - Salman Khan

Salman Khan : బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‏కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అటు నార్త్‏తోపాటు ఇటు సౌత్ లోనూ తనకంటూ మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రంలో కీలకపాత్రలో నటించి మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు సల్మాన్. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్న సల్మాన్(Salman Khan).. ఇటు బుల్లితెరపై బిగ్ బాస్ రియాల్టీ షోకు హోస్టింగ్ కూడా చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ కెరీర్ లో వన్ ఆఫ్ ది హిట్ మూవీ ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’. 2012లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అలాగే మ్యూజికల్ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి సూరజ్ భర్జాత్య దర్శకత్వం వహించారు. ‘ మైనే ప్యార్ కియా’, ‘హమ్ ఆప్కే హై కౌన్’, ‘హమ్ సాథ్ సాథ్ హై’ తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమా ఇదే.

Salman Khan Comment

ఈ మూవీలో సల్మాన్ ఖాన్ సరసన సోనమ్ కపూర్ కథానాయికగా నటించింది. అయితే ఈ మూవీకి ముందుగా ఆమెను హీరోయిన్‏గా నిరాకరించాడు సల్మాన్. ఎందుకంటే వీరిద్దరి మధ్య దాదాపు 20 ఏళ్ల గ్యాప్ ఉంది. సల్మాన్ 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు సోనమ్ జన్మించింది. ఇద్దరి మధ్య వయసు వ్యత్సాసం ఇరవై ఏళ్లు. ఈ కారణంగానే సోనమ్ కపూర్ తో నటించనని సల్మాన్ చెప్పినట్లు సమాచారం. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ సూరజ్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘ ప్రేమ్ రతన్ ధన్ పాయో స్క్రిప్టు రాసి.. సల్లూకి ఏ హీరోయిన్ సరిపోతుందని చర్చించుకున్నాము. చాలా మంది హీరోయిన్ల పేర్లు వచ్చాయి. కానీ రంజనా సినిమా చూసిన తర్వాత సోనమ్ కపూర్ సరైన నటి అని అనిపించింది. ఈ విషయాన్ని సల్మాన్ ఖాన్‌(Salman Khan)కి చెప్పాను. అతను నా వైపు చూశాడు. ఆలోచిద్దాం అన్నాడు. అలా నెలలు గడిచిపోయాయి. సల్మాన్ నుంచి ఎలాంటి ఆన్సర్ రాలేదు. సోనమ్ కపూర్ ఎత్తు, వయస్సు గురించి అనేక ఆలోచనలు వచ్చాయి.

ఆమె నాకంటే చాలా చిన్నది. నా ముందే పెరిగింది. తన ఎదుగుదలను నేన చూశాను. నా కూతురు లాంటి అమ్మాయితో ఎలా నటించాలి. అందుకే ఈ సినిమాలో సోనమ్ వద్దు అని అన్నాడు. కానీ ఈ సినిమాను సల్మాన్ సర్ ను ఒప్పించడానికి చాలా కష్టపడ్డాము. ఎట్టకేలకు ఆయన అంగీకరించాడు. కానీ ఈ మూవీ స్టోరీని ముందుగా సోనమ్ కపూర్ తండ్రి అనిల్ కపూర్ కు చెప్పాలని అన్నాడు. దీంతో అనిల్ సర్ కూడా ఆ పాత్రకు సోనమ్ కరెక్ట్ ఛాయిస్ అనుకున్నాడు. అలా ప్రేమ్ రతన్ ధన్ పాయో సినిమా వచ్చింది ‘ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ‘సికిందర్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయిక. ఈ సినిమాపై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు.

Also Read : Jani Master : జానీ మాస్టర్ నేషనల్ అవార్డును రద్దు చేసిన కేంద్ర సర్కార్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com