Kanguva Movie : కోలీవుడ్ నుంచి పాన్ ఇండియా హిట్ కొట్టాలని తహతహలాడుతున్న సూర్య

శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర కంటెంట్ చూస్తుంటే....

Hello Telugu - Kanguva Movie

Kanguva : తమిళ ఇండస్ట్రీ నుంచి ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి కానీ అసలైన పాన్ ఇండియన్ సినిమా మాత్రం ఇంకా రాలేదు. అన్నింట్లో ముందున్నా.. ఈ ఒక్క విషయంలో వెనకే ఉన్నారు తమిళ తంబిలు. మరి వాళ్ల ఆశ సూర్య అయినా తీరుస్తారా..? కంగువా(Kanguva)తో పాన్ ఇండియన్ మ్యాజిక్ చేస్తారా..? అసలు కంగువా కోసం సూర్య చేస్తున్న ప్లాన్స్ ఏంటి..? ఇండియన్ సినిమాలో ఒకప్పుడు బాలీవుడ్ తర్వాత కోలీవుడ్ ఉండేది.. ఆ తర్వాతే టాలీవుడ్ ఉండేది. కానీ ఇప్పుడలా కాదు.. టాలీవుడ్ టాప్ ప్లేస్‌కు వెళ్తే.. బాలీవుడ్ రెండో స్థానంలో.. తమిళ ఇండస్ట్రీ మూడో స్థానంలో ఉంది. వందల కోట్లు వసూలు చేస్తున్నా.. పాన్ ఇండియా వేటలో వెనకే ఉండిపోయారు తమిళ తంబిలు. ఇప్పుడా లోటును సూర్య తీర్చేస్తానంటున్నారు.

Kanguva Movie Updates

పొన్నియన్ సెల్వన్, లియో, జైలర్, విక్రమ్.. ఇలా చాలా సినిమాలు పాన్ ఇండియా ముసుగులో వచ్చినా తమిళంలో తప్ప ఎక్కడా ఆడలేదు. అందుకే కంగువాతో అసలైన పాన్ ఇండియన్ సినిమా ఇస్తానంటున్నారు సూర్య. శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర కంటెంట్ చూస్తుంటే.. సూర్య నమ్మకంలో తప్పు లేదనిపిస్తుంది. విజువల్ వండర్‌గా దీన్ని రూపొందిస్తున్నారు శివ. కంగువా జాతి తెగ నాయకుడిగా సూర్య నటిస్తున్నారు. బాబీ డియోల్ విలన్‌గా కనిపిస్తున్నారు. తమిళ ఇండస్ట్రీలో హైయ్యస్ట్ బడ్జెట్‌తో వస్తుంది కంగువా. ఒకటి రెండు కాదు.. 38 భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. కోలీవుడ్‌కు కలగా మిగిలిన పాన్ ఇండియన్ విజయాన్ని కంగువా తీసుకొస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. నవంబర్ 14న కంగువా విడుదల కానుంది. ఈ సినిమా కథకు దేవరకు కాస్త పోలికలున్నాయంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రెండు సముద్రం నేపథ్యంలోనే సాగే కథలే. అయితే కంగువా పూర్తిగా దేవర కథకు భిన్నంగా ఉంటుందంటున్నారు మేకర్స్. మొత్తానికి చూడాలిక.. కంగువాతో సూర్య చేయబోయే మ్యాజిక్ ఎలా ఉండబోతుందో..?

Also Read : Jabardasth Rakesh : మా ఇంటికి మహాలక్ష్మి వచ్చిందంటూ పోస్ట్ పెట్టిన జబర్దస్త్ రాకేష్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com