Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తోంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్.జె.సూర్య, సముద్రఖని, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషించగా… ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు, రచయిత కార్తిక్ సుబ్బరాజ్ అందించిన పొలిటికల్, యాక్షన్ కథను ‘గేమ్ ఛేంజర్(Game Changer)’ గా శంకర్ తెరకెక్కిస్తున్నారు. 2024 క్రిస్మస్ సందర్భంగా సినిమాను తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు.
Game Changer Movie Updates
ఈ నేపథ్యంలో ‘గేమ్ చేంజర్’ ప్రమోషన్స్ ను ప్రారంభించింది చిత్ర యూనిట్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి జరగండి జరగండి పాటను విడుదల చేసిన చిత్ర యూనిట్ సోమవారం రా మచ్చ సాంగ్ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించి ప్రోమోను కూడా విడుదల చేసింది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ నిర్మాత దిల్ రాజు, లిరిసిస్ట్ అనంత శ్రీరామ్‌ల ఇంటర్వ్యూ వీడియో ‘ది సౌండ్స్ ఆఫ్ గేమ్ చేంజర్’ పేరుతో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. సినిమా ప్రమోషన్ లో తనదైన శైలిలో ముందుకు వెళ్లే దిల్ రాజు….‘రా మచ్చా.. మచ్చా’ సాంగ్ ప్రోమోను విడుదల చేయడం ద్వారా ఆ సాంగ్ పై హైప్ పెంచారు. తాజాగా ‘ది సౌండ్స్ ఆఫ్ గేమ్ చేంజర్’ వీడియో రిలీజ్ చేసి ఆ హైప్ ను రెట్టింపు చేసారు.
Also Read : Nandamuri Mokshagna: డిసెంబరు నుంచి బరిలోకి నందమూరి మోక్షజ్ఞ !