Lokesh Kanagaraj : ఈ మధ్య ప్రతీ పెద్ద సినిమాకు లీకుల బెడద తప్పట్లేదు. తాజాగా కూలీ కూడా అదే లిస్టులో జాయిన్ అయిపోయింది. రజినీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర లాంటి స్టార్స్ కీలక పాత్రలు చేస్తున్నారు. లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర ఫుటేజ్ బయటికొచ్చిందిప్పుడు. దాంతో దర్శకుడే రంగంలోకి దిగక తప్పలేదు. నిమిషం నిడివి గల నాగార్జున వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. కూలీలో సైమన్ పాత్రలో నటిస్తున్నారీయన. ఈ లీక్డ్ వీడియో చూసాక.. తన ఆవేదన అంతా ట్వీట్లో రాసుకొచ్చారు లోకేష్(Lokesh Kanagaraj). 2 నెలల పాటు వందల మంది పడిన కష్టాన్ని ఒక్క రికార్డింగ్‌తో అవమానించొద్దంటూ ట్వీట్ చేసారు దర్శకుడు లోకేష్ కానగరాజ్. అయితే ఈ వీడియోతో కూలీపై అంచనాలు మరింత పెరిగాయి.
Lokesh Kanagaraj Comment
లీక్డ్ వీడియోస్ కొన్ని సినిమాలకు హెల్ప్ అవుతున్నాయి కూడా. గతంలోనూ బాహుబలి, పుష్ప నుంచి మొదలుకొని చాలా పాన్ ఇండియన్ సినిమాల ఫుటేజ్ లీకైంది.. అవి బ్లాక్‌బస్టర్స్ అయ్యాయి. కూలీకి కూడా ఈ వీడియోతో లాభమే జరిగేలా కనిపిస్తుంది. అలాగని లీక్స్ మంచివని చెప్పట్లేదు.. కానీ వాటిని అరికట్టడం అంత ఈజీ కూడా కాదు. చూడాలిక.. ఇకపై కూలీ టీం ఎంత జాగ్రత్తగా ఉండబోతుందో..?
Also Read : Prakash Raj : పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి మరోసారి ట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్