Sobhita Dhulipala: అంతర్జాతీయ అవార్డుల బరిలో అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ్ల సిరీస్‌ !

అంతర్జాతీయ అవార్డుల బరిలో అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ్ల సిరీస్‌ !

Hello Telugu - Sobhita Dhulipala

Sobhita Dhulipala: బాలీవుడ్‌ ప్రముఖ హీరో అనిల్‌ కపూర్‌, ఆదిత్యరాయ్‌ కపూర్‌ , శోభిత ధూళిపాళ్ల నటించిన తాజా వెబ్‌ సిరీస్‌ ‘ది నైట్‌ మేనేజర్‌’. ఓటీటీలో మంచి విజయాన్ని అందుకున్న ఈ సిరీస్‌ ఇప్పుడు అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇంటర్నేషనల్‌ అవార్డుల బరిలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సిరీస్‌ లతో పోటీ పడనుంది. 52వ ఎమ్మీ అవార్డుల నామినేషన్స్‌ను తాజాగా ప్రకటించారు. అందులో భారత్‌ నుంచి ‘ది నైట్‌ మేనేజర్’ మాత్రమే పోటీలో నిలవడం విశేషం. డ్రామా సిరీస్ విభాగంలో ఆస్ట్రేలియా, అర్జెంటీనా, ఫ్రాన్స్‌కు చెందిన సిరీస్‌ లతో శోభితా(Sobhita Dhulipala) సిరీస్‌ పోటీపడనుంది. నవంబర్‌ 25న న్యూయార్క్‌లో ఎమ్మీ అవార్డుల వేడుక జరగనుంది.

Sobhita Dhulipala…

‘ది నైట్‌ మేనేజర్’ ఎమ్మీ అవార్డుల్లో నామినేషన్‌ దక్కించుకోవడంపై అనిల్‌ కపూర్‌, దర్శకుడు సందీప్‌ మోదీ స్పందించారు. ‘నేను నమ్మలేకపోతున్నా. టీమ్‌ లోని వారందరికీ మెసేజ్‌లు పెట్టా. మేమంతా ఒకరితో ఒకరం మాట్లాడుకుంటూనే ఉన్నాం’ అని అనిల్‌ కపూర్‌ సంతోషం వ్యక్తంచేశారు. ఆనందంతో కన్నీళ్లు వస్తున్నాయని దర్శకుడు తన ఇన్‌ స్టాలో పేర్కొన్నారు. ఈ సిరీస్‌ కోసం వర్క్‌ చేసిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. థ్యాంక్యూ గాడ్‌ అని రాసుకొచ్చారు.

2016లో వచ్చిన ఆంగ్ల సిరీస్‌ ‘ది నైట్‌ మేనేజర్‌’ ను అదే పేరుతో ఓటీటీ సంస్థ ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’ హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీలో రీమేక్‌ చేసి ప్రసారం చేసింది. ఈ సిరీస్‌ ప్రేక్షకాదరణను సొంతం చేసుకోవడంతో దీని రెండో సీజన్‌ను తెరకెక్కించారు. అదీ మంచి విజయాన్ని అందుకుంది.

Also Read : ANR National Award: మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్నార్ అవార్డ్ ! ప్రకటించిన కింగ్ నాగార్జున !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com