Prabhas : ప్రభాస్, హను రాఘవపూడి సినిమా టీజర్ రెడీ అవుతుందా..? ఎహే ఊరుకోండి.. మీరు మరీనూ షూటింగ్ మొదలయ్యే వారం కాలేదు అప్పుడే టీజర్ ఏంటి..? చెప్పడానికైనా ఉండాలి అనుకుంటున్నారు కదా.? కానీ ఇదే నిజం.. నిజ్జంగా ఫౌజీ టీజర్ రాబోతుంది. దర్శకులను ఆ రేంజ్లో పరుగులు పెట్టిస్తున్నారు రెబల్ స్టార్. ప్రభాస్(Prabhas) స్పీడ్ చూసి నిజంగానే ఇటు అభిమానులు.. అటు ఇండస్ట్రీ దండాలయ్య అంటూ పాడుకుంటున్నారు. ఈయన బ్యాలెన్సింగ్ చూసిన తర్వాత.. ఏ హీరోకైనా కళ్లు బైర్లు గమ్మక మానవు. వందల కోట్ల బడ్జెట్‌తో ఏడాదికి ఓ సినిమా విడుదల చేస్తున్నారు ప్రభాస్. తాజాగా హను రాఘవపూడి సినిమాపై అదిరిపోయే అప్డేట్ వచ్చింది. కథ చెప్పి డేట్స్ తీసుకున్నంత ఈజీ కాదు.. ప్రభాస్‌తో సినిమా చేయడం అంటే..!
Prabhas Spirit Movie Updates
ప్లానింగ్ లేకపోతే కనీసం ప్రభాస్ పక్కకు కూడా వెళ్లలేరు. ఈ స్థాయిలో ఒకేసారి మూడు నాలుగు సినిమాలు బ్యాలెన్స్ చేస్తున్న హీరో మొత్తం ఇండియాలోనే లేరు. ప్రభాస్ ఒక్కడికే ఇది సాధ్యమవుతుంది. ఓ సినిమా సెట్స్‌పై ఉండగానే.. నెక్ట్స్ 2 సినిమాల స్క్రిప్ట్స్ ఫైనలైజ్ చేస్తున్నారు రెబల్ స్టార్. ప్రభాస్(Prabhas) ప్రస్తుతం రాజా సాబ్తో బిజీగా ఉన్నారు. ఈ చిత్ర షూటింగ్ మరికొన్ని రోజుల్లోనే పూర్తి కానుంది. ఇది సెట్స్‌పై ఉండగానే.. మధురైలో హను సినిమా మొదలైపోయింది. ఫస్ట్ షెడ్యూల్లో ప్రభాస్ లేని సీన్స్ తీస్తున్నారు. 1940స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సుభాష్ చంద్రబోస్ టాపిక్ కూడా ఉండబోతుంది.
దసరాకు ఈ సినిమా గ్లింప్స్ వస్తుందని తెలుస్తుంది. హను సినిమాకు ఫౌజీ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. రెండో షెడ్యూల్ నుంచి ప్రభాస్ కూడా సెట్స్‌లో జాయిన్ కానున్నారు. దాదాపు 400 కోట్లతో మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2025 మార్చ్ నాటికి ఫౌజీ షూట్ పూర్తి కానుంది. ఆ సమయానికి స్పిరిట్ కథతో ప్రభాస్ కోసం వేచి చూస్తుంటారు సందీప్ వంగా. ఈ లెక్కన వచ్చే ఏడాది కూడా ప్రభాస్ 2 సినిమాలతో రానున్నారు. ఆ సినిమా 400 కోట్లు వసూలు చేసింది.. ఈ సినిమా 500 కోట్లు వసూలు చేసిందని వింటుంటాం కదా..! కానీ ఓ ఇండియన్ సినిమాకు సింగిల్ లాంగ్వేజ్‌లో మొదటిసారి 100 కోట్లు ఎప్పుడొచ్చాయో తెలుసా..? అక్కడ్నుంచి 100, 100 పెంచుకుంటూ ఇప్పుడు 600 కోట్ల వరకు వచ్చింది రేంజ్.
Also Read : Hari Hara Veera Mallu : పవర్ స్టార్ సినిమా నుంచి ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్