Devara Updates : భారీ క్రేజ్ ఉన్న ‘దేవర’ మలయాళ మార్కెట్ రైట్స్ 50 లక్షల

అయితే దేవర బిజినెస్‌ లెక్కలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో అసక్తికర చర్చలకుు దారితీశాయి...

Hello Telugu - Devara Updates

Devara : టాలీవుడ్‌లో స్టార్‌ హీరోలందరూ పాన్‌ ఇండియా రేంజ్‌ మార్కుట్‌ను క్రియేట్‌ చేసుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. అగ్రతారలైన ప్రభాస్‌, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇలా అందరూ సోలోగా తమ సోలోగా తమ సినిమాలతో సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో కొందరు ఇప్పటికే సఫలం అయ్యారు. కొందరు ఇంకా కసరత్తులు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ పోటీలో జూనియర్‌ ఎన్టీఆర్‌ ఉన్నారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘దేవర(Devara)’ మొదటి పార్ట్‌ విడుదలకు సిద్ధమైంది. పాన్‌ ఇండియా స్థాయిలో ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే బాలీవుడ్‌, కోలీవుడ్‌లో ప్రచారం ముమ్మరంగా చేశారు. సినిమాపై క్రేజ్‌ పెంచేందుకు శాయశక్తుల కృషి చేస్తున్నారు.

అయితే దేవర(Devara) బిజినెస్‌ లెక్కలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో అసక్తికర చర్చలకుు దారితీశాయి. కొన్ని ఏరియాల్లో ఈ సినిమాకు అతి తక్కువ బిజినెస్‌ ఫిగర్స్‌ కనిపించటం అబి?మానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్‌ 113 కోటు, ఓవర్సీస్ 26 కోట్లు జరిగినట్లు తెలుస్తోంది. హిందీ వెర్షన్‌ కేవలం 15 కోట్లకు మాత్రమే అమ్మడవటం జరిగింది. కర్నాటకలో 15 కోట్లు, తమిళంలో 6 కోట్లు బిజినెస్‌ జరగగా, కేరళలో కేవలం రూ.50 లక్షలే పలికిందని టాక్‌ నడుస్తోంది. దేవర మలయాళ హక్కులు ఇంత తక్కువా అని అభిమానులు నిరాశపడుతున్నారు. మలయాళంలో తెరకెక్కిన చిన్న చిత్రాలనే తెలుగులో అనువదించడానికి కోటి నుంచి రెండు కోట్ల వరకూ పెడుతున్నారు. దేవర సినిమాను ఇంత చీప్‌గా రూ.50లక్షలే బిజినెస్‌ జరగడం పట్ల నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.

Devara Movie Updates

అలాగే ఆర్‌ఆర్‌ఆర్‌తో బాలీవుడ్‌ ప్రేక్షకుల్ని సైతం మెప్పించిన తారక్‌కు హిందీలో కూడా క్రేజ్‌ ఉంది. కరణ్‌ జోహార్‌ హిందీలో దేవర చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. అయినా బాలీవుడ్‌ హక్కులు రూ.15 కోట్లు దగ్గరే ఆగిపోయింది. అంటే ఎన్టీఆర్‌ రేంజ్‌కి ఈ ఫిగర్‌ తక్కువనే భావిస్తున్నారట. అది కూడా సినిమాలో జాన్వీ కపూర్‌, సైఫ్‌ అలీఖాన్‌ ఉండబట్టే కరణ్‌ జోహార్‌ ఆ మాత్రం అమౌంట్‌కు కొన్నట్లు తెలుస్తోంది.

ఇక బాగా బిజినెస్‌ జరిగింది అనుకుంటున్న తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్‌ హక్కులను కూడా నాగవంశీ తీసుకున్నాడు కాబట్టి.. అమౌంట్‌ ఎక్కువ చేసి చూపించుకున్నారనే వాదన తొలి నుంచి ఉండనే ఉంది. ఎన్టీఆర్‌ వరకు అతను సోలో హీరోగా నటించిన గత చిత్రం ‘అరవింద సమేత’ తో పోలిస్తే కెరీర్‌లో ‘దేవర(Devara)’కు హయ్యెస్ట్‌ బిజినెస్‌ జరిగినట్లు అనుకున్నా. సినిమాకు పెట్టిన బడ్టెట్‌కు తీసుకొచ్చిన హైప్‌నకు ఈ బిజినెస్‌ తక్కువనే మాట వినిపిస్తోంది. మిగతా హీరోల పాన్‌ ఇండియా మార్కెట్‌, బిజినెస్‌తో పోల్చి చూస్తే దేవరకు జరిగిన బిజినెస్‌ ఏమాత్రం ఎంకరేజింగ్‌గా లేనట్లే ఉందని ఫ్యాన్స్‌ వాపోతున్నారు. ఇదంతా కొరటాల శివ దర్శకత్వం వహించిన ‘ఆచార్య’ డిజాస్టర్‌ కావడమే ఓ కారణమని చెబుతున్నారు. తారక్‌ ప్రాణం పెట్టి పని చేసిన ఈ చిత్రం ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

Also Read : Maruthi Nagar Subramanyam : 20 రోజులకే ఓటీటీలో దూసుకుపోతున్న ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com