Natural Star Nani: సెట్స్‌ పైకి నాని 32వ సినిమా !

సెట్స్‌ పైకి నాని 32వ సినిమా !

Hello Telugu - Natural Star Nani

Natural Star Nani: నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన ‘సరిపోదా శనివారం’ బ్లాక్‌ బస్టర్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సరిపోదా శనివారం విజయోత్సవాల్లో మునిగితేలుతున్న నాని… గ్యాప్ లేకుండా తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టారు. ‘సరిపోదా శనివారం’ తర్వాత నాని చేస్తున్న సినిమాకు సంబంధించి రీసెంట్‌గా అనౌన్స్‌మెంట్ రాగా.. ఆ సినిమా శుక్రవారం నుంచి రెగ్యులర్ షూటింగ్‌కు సిద్ధమైంది. ఈ విషయాన్ని తెలుపుతూ.. మేకర్స్ అప్డేట్ ఇచ్చారు.

Natural Star Nani Movie Updates

నాని తన 32వ మూవీ ‘HIT: The 3rd Case’లో మోస్ట్ ఇంటెన్స్ క్యారెక్టర్‌ ని పోషిస్తున్నారు. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యునానిమస్ ప్రొడక్షన్స్‌ తో కలిసి వాల్ పోస్టర్ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. హిట్ ఆఫీసర్‌ గా నాని(Natural Star Nani) క్యారెక్టర్ పరిచయం చేసిన గ్రిప్పింగ్ గ్లింప్స్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే.

ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైనట్లుగా మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. హీరో నాని మొదటి రోజే షూట్‌లో జాయిన్ అయ్యారు. ఈ మూవీలో HIT ఆఫీసర్ అర్జున్ సర్కార్‌గా ఫెరోషియస్ క్యారెక్టర్‌లో నాని కనిపించబోతున్నారు. ఈ క్యారెక్టర్ కోసం నాని కంప్లీట్‌గా మేకోవర్‌ అవుతున్నారు. ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. ప్రముఖ డీవోపీ సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫి అందిస్తుండగా.. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ సమకూరుస్తున్నారు. ఈ మూవీకి కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్, శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు. 1 మే, 2025న వేసవిలో HIT 3‌ని థియేటర్లలోకి తీసుకువస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు.

Also Read : Sathyam Sundaram: కార్తీ, అరవింద్ స్వామి ‘సత్యం సుందరం’ టీజర్ రిలీజ్ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com