Demonte Colony 2 : ఓటీటీలో సస్పెన్స్, థ్రిల్లర్, హారర్ సినిమాలకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మిగతా జానర్ల కంటే ఇలాంటి సినిమాల కోసమే ఆడియెన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు తగ్గట్టే పలు ఓటీటీ సంస్థలు ప్రతి వారం ఏదో ఒక హారర్ సినిమాను ప్రేక్షకుల కోసం స్ట్రీమింగ్ కు తీసుకొస్తుంటాయి. అలా థియేటర్లలో ప్రేక్షకులకు చెమటలు పట్టించిన ఓ సూపర్ హిట్ హారర్ మూవీ త్వరలోనే ఓటీటీలోకి రానుంది. అదే ‘డిమోంటీ కాలనీ 2(Demonte Colony 2). 2015లో తమిళంలో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ‘డిమోంటీ కాలనీ’ సినిమాకు ఇది సీక్వెల్‌గా తెరకెక్కింది.
మొదటి పార్ట్ సూపర్ హిట్ కావడం, రెండో పార్ట్ పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్లు మరింత భయపెట్టేలా ఉండడంతో డిమోంటీ కాలనీ 2(Demonte Colony 2) మూవీపై బాగానే బజ్ క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్టుగానే ఆగస్టు 15వ తేదీన తమిళంలో గ్రాండ్ గా రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక వారం ఆలస్యంగా అంటే సెప్టెంబర్ 23న తెలుగులో రిలీజ్ కాగా, ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అజయ్ జ్ఞానమూర్తి తెరకెక్కించిన ఈ సూపర్ హారర్ థ్రిల్లర్ మూవీలో అరుళ్ నిధి, ప్రియా భవాని శంకర్, అర్చనా రవిచంద్రన్, త్సెరింగ్ దోర్జీ, అరుణ్ పాండియన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Demonte Colony 2 OTT Updates
థియేటర్లలో ప్రేక్షకులను థ్రిల్ కు గురిచేసిన డిమోంటి కాలనీ 2 ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 సొంతం చేసుకుంది. ఇందుకోసం సదరు సంస్థ నిర్మాతలకు మంచి మొత్తాన్నే ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో సెప్టెంబర్ 20 లేదా 27 వ తేదీల్లో ఏదో ఒక రోజు డిమోంటీ కాలనీ 2 ఓటీటీలోకి రానుందని సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం. BTG యూనివర్సల్, వైట్ నైట్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై జ్ఞానముత్తు, బాబీ బాలచంద్రన్ సంయుక్తంగా డిమోంటీ కాలనీ 2 ను నిర్మించారు. సామ్ సీఎస్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు.
Also Read : 35 Chinna Katha Kaadu : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ’35 చిన్న కథ కాదు’ సినిమా టీమ్