Malaika Arora : మలైకా తండ్రి అనిల్ అరోరా నేడు ఉదయం ముంబై బాంద్రాలోని తన ఇంటి టెర్రస్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనే దానికి కారణం ఇంకా తెలియలేదు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. మలైకా తండ్రి అనిల్ అరోరా మరణంతో ప్రస్తుతం బాలీవుడ్లో విషాదం నెలకొంది. పలువురు బాలీవుడ్ సినీ సెలబ్రిటీలు అనిల్ అరోరాకు నివాళులు అర్పిస్తున్నారు. మలైకా తండ్రి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది.
అనీల్ అరోరా ఆత్మహత్య చేసుకునే సమయంలో మలైకా ఇంట్లో లేరు. ఆమె పూణేలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు పేర్కొన్నారు. విషయం తెలిసిన వెంటనే మలైకా(Malaika Arora) వెంటనే పూణే నుంచి ముంబైకి బయలుదేరారు. ఆత్మహత్యకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. అనారోగ్యంతో బాధపడుతున్న అనీల్ అరోరా ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. తీవ్ర ఆందోళనకు గురై ఆయన బిల్డింగ్‌పైకి వెళ్లి దూకేశారా లేదా ఈ ఆత్మహత్య వెనుక మరేవైనా కారణాలు ఉన్నాయా.. అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
Malaika Arora Father Suicide..
మలైకా అరోరాకు 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఆమె తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. మలైకాకు ఓ సోదరి ఉంది. విడాకుల అనంతరం పిల్లలు ఇద్దరూ తన తల్లి వద్ద పెరిగారు. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత మాత్రం ఎక్కువుగా మలైకా(Malaika Arora) తన తండ్రితో కనిపించేది. అనీల్ అరోరా మర్చంట్ నావీలో పనిచేశారు. 2022లో మలైకా ఓ ఇంటర్వ్యూలో తన బాల్యం గురించి చెప్పారు. తన జీవితంలో ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారో ఆమె వివరించారు. తన తల్లిదండ్రులు అనీల్ అరోరా, జాయిస్ పాలీకార్ప్ తనకు 11 ఏళ్లు ఉన్నప్పుడే విడాకులు తీసుకున్నారని గుర్తు చేసుకుంటూ.. ఆ తర్వాత ఆమె ఎలా పెరిగిందనే విషయాన్ని వివరించారు.
అనీల్ అరోరా విడాకులు తీసుకునే సమయానికి ఆరేళ్ల వయసున్న తన సోదరి అమృతతో పాటు మలైకా థానే నుంచి చెంబూర్ వెళ్లి తల్లి వద్ద పెరిగారు. తన బాల్యం ఎంతో అద్భుతమైనప్పటికీ.. అది అంత సులభంగా సాగలేదన్నారు. కష్ట సమయాలు ముఖ్యమైన పాఠాలను నేర్పుతాయని మలైకా తన ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రస్తుతం తన తండ్రి మరణంతో మరోసారి ఆమె బాల్యం గురించి కూడా వార్తలు వైరల్ అవుతుండటం గమనార్హం.
Also Read : Devara Trailer : దేవర ట్రైలర్ పై మరో ఆచార్య అంటూ విమర్శలు