Devara Trailer : దేవర ట్రైలర్ పై మరో ఆచార్య అంటూ విమర్శలు

గత ఏడాది కాలంగా దేవర సినిమా చిత్రీకరణ జరగటం.. ఈ సినిమా ఓపెనింగ్ మొదలు....

Hello Telugu - Devara Trailer

Devara : ఎంతో మంది అభిమానులు చాలాకాలంగా ఎదురు చూసిన జూ.ఎన్టీఆర్ దేవ‌ర సినిమా ట్రైల‌ర్ నిన్న (మంగ‌ళ‌వారం) రిలీజైంది. అయుతే సినిమా కోసం వెయ్యు క‌ళ్ల‌తో ఎదురు చూస్తున్న ప్ర‌జ‌ల‌కు ఈ ట్రైల‌ర్ బాగా నిరుత్సాహ ప‌ర్చింది. దీంతో కొరటాల శివ కేజీఎఫ్ పార్మాట్ లో ఈ సినిమా తీద్దామనుకున్నాడు.. కానీ అది ఆచార్యలానే అయిందనిపిస్తూందంటూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. గతంలో ఆచార్య సినిమాలోని సన్నివేశాలను, దేవర(Devara) ట్రైలర్‌లోని సన్నివేశాలను కంపేర్ చేస్తూ మరీ ట్రోలింగ్ చెస్తూ ఉన్నారు.. అయితే.. ఆచార్య సినిమా అనంతరం దర్శకుడు కొరటాల శివ అల్లు అర్జున్‌తో ఓ సినిమా చెయాల్సి ఉంది.

ఆ సినిమాను తొలుత ఎనౌన్స్ చేశారు కూడా. అయితే అనూహ్యంగా ఆ సినిమా క్యాన్సిల్ అవటం..‌ సడెన్‌గా ఎన్టీఆర్‌తో కొరటాల శివ సినిమా ఫిక్స్ అవటం వెంట‌నే జరిగిపోయింది. ఆచార్య సినిమా ఫలితం, దాని తదనంతరం చిరంజీవి చేసిన కొన్ని కామెంట్స్.. కొరటాల ఇమేజ్‌ను కంప్లీట్‌గా దెబ్బతీసిన పరిస్దితి కనిపించింది. ఈ క్రమంలో కొరటాల శివ తానేంటో మరలా నిరూపించుకోవాల్సిన ప‌రిస్దితి ఏర్పడింది. ఎన్టీఆర్ కొరటాల శివపై నమ్మకంతో దేవర(Devara) చేసే అవకాశం ఇచ్చినపుడు.. అభిమానుల నుంచి రకరకాల అభిప్రాయాలు వ్యక్తమ‌య్యాయి.

Devara  Trailer Updates

గత ఏడాది కాలంగా దేవర సినిమా చిత్రీకరణ జరగటం.. ఈ సినిమా ఓపెనింగ్ మొదలు.. కాస్టింగ్ సెలెక్షన్.. రెండు పార్టులుగా సినిమాను ప్రకటించటం.. ఇలా నిదానంగా దేవరపై హైప్ క్రియేట్ అయిందనుకున్న క్రమంలో ట్రైలర్ రిలీజ్ అయి దేవరపై ఉన్న పాజిటివ్ బజ్‌ను కాస్త డిస్ట్రబ్ చేసినట్లు కన్పిస్తోంది. RRR లో రాజమౌళి, ఎన్టీఆర్ ప్రతిభను తగ్గ పాత్రను డిజైన్ చేసి వరల్డ్ వైడ్ రీచ్ వచ్చేలా చేశారని.. కొరటాల మాత్రం రెగ్యులర్ కమర్షియల్ సినిమా తరహాలోనే దేవర(Devara) సినిమాను, ఎన్టీఆర్‌ పాత్రను డిజైన్ చేయటం బాలేదంటూ సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నారు.

కొంత‌మంది ట్రైల‌ర్‌పై తీవ్ర స్థాయిలో మండి ప‌డుతూ ఇది మ‌రో బ‌చ్చ‌న్ అవుతుందంటూ వీడియోలు చేసి యూ ట్యూబ్‌లో పెడుతున్నారు. అంతేకాదు.. దేవర ట్రైలర్ చూశాక, నిర్మాణ విలువలు భారీగా ఉన్నా.. కంటెంట్ ఏమాత్రం ఆసక్తికరంగా లేదని.. ఎన్టీఆర్ కొరటాలకు ఛాన్స్ ఇచ్చి తప్పు చేశాడా అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు అల్లు అర్జున్ అభిమానులు.. దేవర సబ్జెక్ట్ ను వదులుకుని తమ హీరో సేఫ్ అయ్యాడంటూ రిప్లై ఇస్తున్నారు. ఇదిలాఉండ‌గా ఇక రాజమౌళితో సినిమా చేసిన ఏ హీరోకైనా నెక్ట్స్ మూవీ ప్లాప్ అనే సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఉన్న తరుణంలో..‌ కొరటాల శివ దాన్ని బ్రేక్ చేసి ఎన్టీఆర్‌కు హిట్ ఇచ్చి.. తాను కంబ్యాక్ ఇస్తాడని ఆశించిన వారంతా దేవర ట్రైలర్ చూసి సైలెన్స్ అయ్యరంటూ ట్రోలింగ్ జరుగుతోంది.

Also Read : Kamal Haasan: ప్రభాస్‌ కు కమల్‌ హాసన్ స్పెషల్ గిఫ్ట్‌ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com