Kannappa: మంచు ఫ్యామిలీ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి ప్రతీ సోమవారం ఒక ఆప్డేట్ వదులుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సోమవారం బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా… కన్నప్ప(Kannappa) చిత్రంలో అక్షయ్ కుమార్ పోషించిన శివుని పాత్రకి సంబంధించిన ప్రీ లుక్‌ను రిలీజ్ చేశారు. రుద్రాక్ష మాలతో అలంకరించబడిన చేతిని చూపించారు. ముల్లోకాలను ఏలే పరమేశ్వరుడు.. భక్తికి మాత్రం దాసుడు అంటూ శివుని తత్త్వం గురించి చెప్పే డైలాగ్ పోస్టర్ మీద పెట్టారు.
Kannappa Movie Updates
ఇదిలాఉండగా.. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి శరత్ కుమార్ నాథనాథుడు, మధుబాల పన్నగ, దేవరాజ్ ముండడు, సంపత్ రామ్ చుండడు, ముఖేష్ రిషి ‘కంపడు’ లుక్స్ రిలీజ్ చేయగా గత వారం మంచు విష్ణు కుమారుడు అవ్రామ్ భక్త మంచు, అర్పిత్ రంకా ‘కాలాముఖ’ లుక్ పోస్టర్ ను మూవీ టీం విడుదల చేయగా అవన్నీ మంచి స్పందనను రాబట్టుకున్నాయి.
నటుడు మంచు విష్ణు ప్రధాన పాత్రలో, మంచు కుటుంబం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిస్తోతోన్న సినిమా ‘కన్నప్ప’. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా.మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘మహాభారత’ సిరీస్‌ని రూపొందించిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, శివరాజ్‌కుమార్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రభాస్ శివుడిగా, నయనతార పార్వతిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. విష్ణు మంచు తనయుడు అవ్రామ్ భక్త మంచు తిన్నడు పాత్రతో వెండితెరపైకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ మంచు ఫ్యామిలీ సినిమాల రికార్డులను తిరగరాస్తుంది.
Also Read : Rashmika Mandanna: నేషనల్ క్రష్ కు స్వల్ప ప్రమాదం ! వైరల్ అవుతోన్న రష్మిక ఎమోషన్ పోస్ట్ !