Naga Chaitanya: 15 ఏళ్ళు పూర్తి చేసుకున్న నాగచైతన్య ! ‘తండేల్‌’ స్పెషల్ పోస్టర్ రిలీజ్ !

15 ఏళ్ళు పూర్తి చేసుకున్న నాగచైతన్య ! ‘తండేల్‌’ స్పెషల్ పోస్టర్ రిలీజ్ !

Hello Telugu - Naga Chaitanya

Naga Chaitanya: తెలుగు చిత్ర పరిశ్రమలో పదిహేనేళ్లు పూర్తి చేసుకున్నారు అక్కినేని నట వారసుడు హీరో నాగ చైతన్య. అక్కినేని నాగార్జున వారసుడిగా ‘జోష్‌’ (2009) సినిమాతో హీరోగా పరిచయమయిన నాగచైతన్య… పదిహేనేళ్ల కెరీర్‌లో విలక్షణమైనపాత్రలతో పలు సూపర్‌ హిట్‌ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు. ‘ఏంమాయ చేసావే, ప్రేమమ్,లవ్‌ స్టోరీ, తడాఖా, మజిలి వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. నాగ చైతన్య చిత్రసీమలోకి అడుగు పెట్టి 15ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఆయన కొత్త లుక్‌ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. అందులో చైతూ ఓ నాటు పడవపై నించొని మాస్‌ లుక్‌లో చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు.

Naga Chaitanya…

‘ప్రేమమ్, సవ్యసాచి’ వంటి చిత్రాల తర్వాత నాగచైతన్య(Naga Chaitanya), డైరెక్టర్‌ చందు మొండేటి కాంబినేషన్‌లో రూపొందుతోన్న మూడో చిత్రం ‘తండేల్‌’. అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్‌పై ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్నారు. ‘లవ్‌ స్టోరీ’ చిత్రం తర్వాత హీరో నాగచైతన్య, హీరోయిన్‌ సాయి పల్లవి కలిసి నటిస్తున్న రెండో చిత్రమిది. ‘‘నిజ జీవిత ఘటనల ఆధారంగా ‘తండేల్‌’ రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో శరవేగంగా జరుపుకుంటోంది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. దేశభక్తి అంశాలతో పాటు అందమైన ప్రేమకథతో నిండి ఉంటుంది. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. త్వరలో విడుదల తేదీపై స్పష్టత రానుంది. ఈ సినిమాకి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందిస్తుండగా సినిమాటోగ్రాఫర్ గా షామ్‌ దత్‌ పనిచేస్తున్నారు.

Also Read : Arjundas: అర్జున్‌ దాస్, శివాత్మిక జంట‌గా నటిస్తున్న సినిమా ‘బాంబ్‌’ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com