Rashmika Mandanna: సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కించిన ‘యానిమల్’ తో హిట్ కొట్టి జోరుమీదుంది నేషనల్ క్రష్ రష్మిక. అదే ఊపు మీద బాలీవుడ్ లో పలు సినిమాల్లో ఆమె నటిస్తోంది. యానిమల్ సినిమా తరువాత ఆమె, ఆయుష్మాన్ ఖురానా జంటగా ‘వాంపైర్స్ ఆఫ్ విజయ్ నగర్’ (వర్కింగ్ టైటిల్) లో నటిస్తున్నట్లు గతంలో ప్రకటించారు. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు ఆదిత్య సర్పోత్దార్ తెరకెక్కిస్తున్నారు. రెండు కాలాల మధ్య కథతో రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక మునుపెన్నడూ పోషించని పాత్రలో కనిపించనున్నట్లు ఇటీవలే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ హారర్ కామెడీ చిత్రాన్ని దినేశ్ విజన్, అమర్ కౌశిక్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Rashmika Mandanna Movies
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమర్ కౌశిక్… ఈ సినిమా విశేషాల్ని పంచుకున్నారు. ‘‘ప్రస్తుతం మేము ఆయుష్మాన్ నటిస్తున్న వాంపైర్స్ సినిమా కోసం సన్నాహాలు చేస్తున్నాము. ఈ ప్రాజెక్టుకు ‘తంబా’ అనే పేరును ఖరారు చేశాము. మరో రెండు నెలల్లో చిత్రీకరణను ప్రారంభించనున్నాము. త్వరలో దీని గురించి అధికారికంగా ప్రకటిస్తాము’’ అని చెప్పారు.
Also Read : Ram Charan : ఏపీ, తెలంగాణకు తన వంతు ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన గ్లోబల్ స్టార్