Krithi Shetty: తెలుగులో తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనసు దోచిన కథానాయిక కృతిశెట్టి(Krithi Shetty). ఇప్పటి వరకు తెలుగు, తమిళ చిత్రాలతో అలరించిన ఆమె ఇప్పుడు మలయాళ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. టొవినో థామస్‌తో కలిసి ‘అజయంతే రందం మోషణం’ అనే చిత్రంలో నటించారు. సెప్టెంబర్ 12న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి… టాలీవుడ్ కు, మాలీవుడ్‌కు మధ్య తేడాను వివరించారు. అలాగే చిరంజీవి ప్రాజెక్ట్ ను ఆమె రిజెక్ట్ చేసిందంటూ వస్తోన్న వార్తలపై స్పందించారు.
Krithi Shetty Comment
‘‘ఈ సినిమాలో నా పాత్ర సవాళ్లతో కూడుకున్నది. ఇందులో మూడు ఇంటర్‌కనెక్టడ్ టైమ్ లైన్ లను చూపించారు. చిత్రబృందమంతా అంకితభావంతో పనిచేసింది. ఇందులోని విజువల్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. నేను ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ కాలంలోనే ఇంత గొప్ప ప్రాజెక్ట్‌లో భాగం అవుతానని ఊహించలేదు. ఇందులో పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తాను. మలయాళం నేర్చుకోవడానికి కష్టపడ్డా. ఆ విషయంలో టొవినో థామస్ సాయం చేశాడు. మలయాళ చిత్రపరిశ్రమలో ఎక్కువ గంటలు పని చేయాల్సి ఉంటుంది. టాలీవుడ్‌తో పోలిస్తే ఇక్కడ పనిగంటలు ఎక్కువ. నేను షూటింగ్ లో పాల్గొన్న నాలుగో రోజు నిద్రలేకపోవడం వల్ల కళ్లు కూడా తెరవలేకపోయాను. అలసటగా అనిపించింది. కొన్ని నెలల పాటు అలా నిద్ర లేకుండానే పనిచేశాను. చిత్రబృందంలోని మిగతా వారంతా చాలా ఉత్సహంగా ఉన్నారు. వారికి ఇన్ని గంటలు పనిచేయడం అలవాటైంది. ఆ విషయం నాకు స్ఫూర్తినిచ్చింది’’ అని చెప్పారు.
ఇక మెగాస్టార్ చిరంజీవి ప్రాజెక్ట్‌ను తాను రిజెక్ట్ చేయలేదని కృతి స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తోన్న రూమర్స్‌ను ఖండించారు. తనను ఎవరూ సంప్రదించలేదన్నారు. కృతి తొలి మలయాళ చిత్రం విషయానికొస్తే.. త్రీడీలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రమిది. జితిన్‌లాల్ దర్శకుడు. కృతిశెట్టితోపాటు, ఐశ్వర్యరాజేష్, సురభి లక్ష్మి కథానాయికలుగా నటించారు.
Also Read : N Convention : కింగ్ నాగార్జునకు చెందిన ‘ఎన్ కన్వెన్షన్’ నేలమట్టం