Kiran Abbavaram: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం పెళ్లి చేసుకున్నాడు. తన ప్రియురాలు, తొలి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్ తో కలిసి ఏడడుగులు వేశాడు. కర్ణాటకలోని కూర్గ్ లోని ఓ రిసార్ట్లో గురువారం రాత్రి తెలుగు సంప్రదాయంలో జరిగిన ఈ వేడుకలో రహస్య మెడలో మూడు ముళ్లు వేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. ఈ పెళ్లికి ఇరువురు కుటుంబ సభ్యులు, కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. దీనితో కిరణ్, రహస్యల పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Kiran Abbavaram Marriage…
‘రాజావారు రాణిగారు’ సినిమాతో హీరోహీరోయిన్లుగా పరిచయమైన కిరణ్-రహస్య… ఆ తర్వాత స్నేహితులుగా మారారు. కొన్నాళ్లకు ప్రేమలో పడ్డారు. అయితే తమ బంధాన్ని చాలా రహస్యంగా ఉంచారు. ఈ ఏడాది మార్చిలో నిశ్చితార్థం చేసుకుని అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు పెళ్లితో ఒక్కటయ్యారు. కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) చివరగా రూల్స్ రంజన్ సినిమాలో కనిపించగా ప్రస్తుతం కిరణ్ హీరోగా ‘క’ సినిమా రూపొంది విడుదలకు రెడీ అవుతుండగా ఈ మూవీకి తన భార్య రహస్య సీఈవోగా పని చేస్తుంది.ఈ సినిమాను కిరణ్ సొంతంగా నిర్మిస్తున్నాడు. అంటే నిర్మాణ బాధ్యతల్ని రహస్య చూసుకుంటోంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది. సుజీత్, సందీప్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన ‘క’ టీజర్ మంచి స్పందనను రాబట్టుకుంది.
Also Read : Rishab Shetty: ‘కాంతార: చాప్టర్ 1’ కోసం కలరిపయట్టు యుద్ధ విద్యలో రిషబ్ శెట్టి !