Dil Raju : ఓటీటీ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత థియేటర్లలో సినిమాలు చూసే వారి సంఖ్య ఎంతో కొంత తగ్గిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా థియేటర్లలో వచ్చిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఓటీటీలో సినిమాలు వస్తుండడంతో థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య తగ్గుతోంది. అయితే ఇదే విషయమై తాజాగా ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రేక్షకులు థియేర్లకు రాకుండా వాళ్లను తామే చెడగొట్టామని చెప్పుకొచ్చారు. థియేటర్లలో వచ్చిన నాలుగు వారాలకే సినిమాను ఓటీటీలోకి తీసుకురావడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అన్నారు. ఇటీవల జరిగిన ‘రేవు’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈరోజుల్లో సినిమా తీయడం గొప్ప కాదని, ప్రేక్షకుడు థియేటర్‌కు వచ్చి ఆ మూవీని చూడటమే బిగ్ ఛాలెంజ్ అని దిల్ రాజు(Dil Raju) అన్నారు. తామ నిర్మాణంలో వచ్చిన ‘బలగం’, ‘కమిటీ కుర్రోళ్ళు’ నెమ్మదిగా మౌత్ టాక్ ద్వారా ప్రేక్షకులకు చేరాయి. అదే సమయంలో సినిమా బాగుందని రివ్యూలు ఇవ్వడం కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయని దిల్ రాజు చెప్పుకొచ్చారు.
Dil Raju Comment
ఇక ఆయన మాట్లాడుతూ.. అసలు ప్రేక్షకులను చెడగొట్టింది తామే అంటూ వ్యాఖ్యానించారు. ‘ మీరు ఇంట్లో కూర్చోండి. నాలుగు వారాల్లో ఓటీటీకి తెస్తాం’ అని థియేటర్‌కు రాకుండా చేసుకున్నామని అన్నారు. అలాగే రేవే సినిమా గురించి మాట్లాడుతూ.. ఇది మంచి సినిమా అని, అదీ చిన్న మూవీ అయితే, ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని దిల్ రాజు పిలుపునిచ్చారు. దిల్ రాజు చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా చర్చకు దారి తీశాయి. థియేటర్లలో సినిమా చూసే వారి సంఖ్య తగ్గడానికి ఓటీటీలతో పాటు టికెట్ల ధరలు పెరగడం వంటి అంశాలు కూడా కారణమని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద దిల్‌రాజు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కొత్తకు చర్చకు దారి తీశాయి.
Also Read : Hero Dhanush : నిత్యామీనన్ కు జాతీయ అవార్డు రాకతో ఎమోషనల్ పోస్ట్ చేసిన ధనుష్