Pawan Kalyan: సినిమా హీరోలపై పవన్‌ కళ్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు ! అల్లు అర్జున్ కోసమేనా ?

సినిమా హీరోలపై పవన్‌ కళ్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు ! అల్లు అర్జున్ కోసమేనా ?

Hello Telugu - Pawan Kalyan

Pawan Kalyan: సినిమా హీరోలపై ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు సినిమాల్లో హీరో అడవులను కాపాడేవాడని… ఇప్పుడు స్మగ్లింగ్ చేయడమే హీరోయిజం అయ్యిందని వ్యాఖ్యానించారు. బెంగళూరు పర్యటనలో ఉన్న ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ… ‘40 ఏళ్ల క్రితం సినిమాల్లో హీరో అడవులను కాపాడేవాడు. కానీ ఇప్పుడు హీరోనే అడవులను నరికి స్మగ్లింగ్‌ చేస్తున్నాడు. ఒక్క సినిమా వ్యక్తిగా అలాంటి సినిమాలు చేయడం నాకు కష్టం. అది బయటికి మంచి మెసేజ్ ను ఇవ్వలేదు ’ అని పవన్‌ అన్నారు. అయితే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాలతో పాటు మెగా, అల్లు ఫ్యామిలీలో హాట్ టాపిక్ గా మారాయి.

Pawan Kalyan – అల్లు అర్జున్ ‘పుష్ప’ గురించేనా ?

ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో పవన్‌ కళ్యాణ్(Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశాడని కొంతమంది నెటిజన్స్‌ అభిప్రాయపడుతున్నారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌ గందపు చెక్కలు స్మగ్లింగ్‌ చేసే వ్యక్తిగా నటించాడు. ఆ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్‌ గా నిలిచింది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్‌ అల్లు నటనకు ఫిదా అయ్యారు. ఈ చిత్రం బన్నీకి జాతీయ అవార్డును కూడా తెచ్చిపెట్టింది. అలాంటి సినిమాపై పవన్‌ కళ్యాణ్‌ పరోక్షంగా సెటైర్లు వేశాడని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సొంత మేనమామ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కు ట్విట్టర్ ద్వారా ఆల్ ది బెస్ట్ చెప్పిన అల్లు అర్జున్… తన స్నేహితుడు, నంధ్యాల వైసీపీ అభ్యర్ధి శిల్పా రవిచంద్రారెడ్డికి మాత్రం భార్య స్నేహారెడ్డితో కలిసి స్వయంగా ఇంటికి వెళ్ళి మరీ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఇటీవల జరిగిన ఎన్నికలు అటు వైసీపీకు, ఇటు టీడీపీ, జనసేన, బీజేపీల కూటమికి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారడంతో… అల్లు అర్జున్ తీసుకున్న నిర్ణయంపై మెగా ఫ్యామిలీ అభిమానుల్లో కాస్తా గందరగోళానికి గురైయింది. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి ఓడిపోవడంతో పాటు ఆ పార్టీ ఘోర పరాజయం పాలయింది. అదేసమయంలో పవన్ కళ్యాణ్ పార్టీ వంద శాతం స్ట్రైక్ రేట్ తో దేశ రాజకీయ చరిత్రలో రికార్డు సృష్టించడంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఏర్పాటులో కీలకంగా మారింది. అంతేకాదు పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా కేబినెట్ లో స్థానం దక్కించుకున్నారు.

Also Read : Megastar Chiranjeevi: కేరళ సీఎంకు స్వయంగా చెక్ అందజేసిన మెగాస్టార్ చిరంజీవి !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com